అయ్యో పాపం శృతిహాసన్

అయ్యో  పాపం శృతిహాసన్

సినిమా పరిశ్రమల్లో ఇంతవరకు ఎంతో మంది హీరోలు, వారి కుమారులు సినిపరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తున్నారు. అయితే హీరోయిన్లు మాత్రం తక్కువగా ఉన్నారు. బాలీవుడ్ లో రణదీప్ కపూర్ కుమార్తెలు, రాధ కూతురు సినీ పరిశ్రమలోకి హీరోయిన్లుగా అడుగుపెట్టారు. అయితే మన విశ్వనటుడు కమల్ హసన్ కుమార్తె శృతి హాసన్ సినిమాల్లోకి హీరోయిన్ గా అడుగుపెట్టింది. కానీ మొదటి సినిమాలు అంతగా హిట్ కాలేదు.

ఎప్పుడైతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ సినిమాలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిందో, శృతిహాసన్ జీవితం మారిపోయింది వరుసగా ఒకదాని తర్వాత ఒకటి విజయాలే తన జీవితంలో చూస్తున్నా సమయంలో మరలా బ్రేక్ పడింది . ఈ మధ్యకాలంలో శృతిహాసన్ సినిమాలు చెయ్యడానికి పెద్దగా అవకాశాలు లేవని బాధపడుతున్నారట.

అయితే కమలహాసన్ నటిస్తున్న శభాష్ నాయుడు అనే సినిమా ఒకటి ఉంది అని. ఇది తమిళంలో భారీ బడ్జెట్ తో బాహుబలికి సమానంగా తీసుకెళ్లాలని చూస్తున్నారట, అయితే ఈ సినిమాలో సంఘమిత్ర పాత్రకి శృతిహాసన్ కి అవకాశం ఇవ్వాలనుకున్నా అది కాస్తా చేయి జారిపోయిందట, ఇప్పుడు సరికొత్త సినిమాతో శృతి కన్నడ భాషలో సినిమా చేస్తుందని మాట వినిపిస్తోంది. కానీ శృతిహాసన్ మాత్రం నేను కన్నడ సినిమా చేయను అని క్లారిటీ ఇచ్చింది. అంతేకాక ఇక జీవితంలో కన్నడంలో ఏ సినిమా చేయను అని చెప్పకనే చెప్పేశారు.