ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి వాస్తుదోషం ఉందా?

ఆంధ్రప్రదేలోని కొత్త రాజధాని అసెంబ్లీ వెలగపూడిలో ఆధునిక సదుపాయాలతో నిర్మించారు. భారతదేశంలో అత్యాధునిక అసెంబ్లీ ఇదే అయితే దీనికి వాస్తు దోషం ఉంది? అని అంటున్నారు. అందువల్ల దీని గోడని పడేసి మరొక గేటును నిర్మిస్తున్నారు.

ఆంధ్ర ప్రదేశ్ సెక్రటేరియట్ తో పాటు అసెంబ్లీని అత్యంత ఆధునిక సదుపాయాలతో నిర్మించారు. సంవత్సరానికి దీనిని పూర్తి చేసి రికార్డు సృష్టించారు. ఇది పూర్తి అయిపోయినాక హైదరాబాదు నుండి పాలను పూర్తిగా ఇక్కడకు మార్చేశారు. అయితే అసెంబ్లీ నిర్మాణము కాస్త ఆలస్యమైంది. అది కూడా పూర్తయిన తర్వాత దాన్ని కూడా వెలగపూడికి మార్చేశారు.

అయితే ఇప్పుడు అసెంబ్లీకి వాస్తు దోషం ఉందని బయటకు వచ్చింది. దీనివలన పడమర వైపున సీఎం కార్యాలయం ఉన్న మొదటి బ్లాకులు ఎదురుగా ఒక గేటు ఏర్పాటు చేశారు. ఇది సీఎం కార్యాలయానికి ఎదురుగా ఉంటుంది. ఈ గేటు ఏర్పాటుపై కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి. వాస్తు దోషం ఉండటం వలన ఏర్పాటు చేశారని, అసెంబ్లీ కార్యాలయ వర్గాలు తెలిపాయి. సీఆర్డిఏ అధికారులు మాత్రం అది ఏమీ లేదని అంటున్నారు. కేవలం వాళ్ళ సౌలభ్యం కోసమే మరొక గేటును ఏర్పాటు చేశారని అంటున్నారు.

Bharath Today
Assign a menu in the Left Menu options.