ఈ నెల డిసెంబర్ 31వ తేదీన విజయవాడలో ఆంక్షలు వేస్తున్న పోలీసులు

taajavarthalu

కొత్త సంవత్సరం వస్తుందంటే చాలు ఎక్కడ చూసినా అల్లరి మరియు వారి సంతోషానికి హద్దులు ఉండవు. కాబట్టి గడచిన సంవత్సరం  2017 విడిచిపెట్టి 2018 కు అడుగుపెడుతుంటే ఎన్నో వేడుకలు ఒక పండుగలా జరుపుకుంటారు.
ఈనెల 31వ తేదీన విజయవాడలో డ్రా౦క్ అండ్ డ్రైవ్ పరీక్ష నిర్వహిస్తున్నారు, డీసీపీ కాంతిరాణా, గజరావు, భూపాల్ రావులు , తెలియజేస్తున్నారు.

రోడ్డు పైన ఎక్కువగా ట్రాఫిక్ అనేది ఉండవచ్చు అందువలన త్రిబుల్ రైడింగ్ హైస్పీడ్ డ్రైవింగ్ చేయవద్దని చెబుతున్నారు. బైక్ డ్రైవ్ చేసే వారికి ముఖ్యంగా హెచ్చరిస్తున్నారు. విజయవాడ నగరంలో బైక్ ర్యాలీలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటారు. ఏవైనా వేడుకలు నిర్వహించాలని ఉంటే ముందుగానే పోలీసులకు తెలియజేయాలని చెబుతున్నారు. మరీ ముఖ్యంగా హాస్పిటల్స్ చుట్టుప్రక్కల ఎటువంటి వేడుకలు నిర్వహించకూడదు అని హెచ్చరిస్తున్నారు. పేకాట ఆడడం మరియు కోడిపందాల ఆట ఆడడం వంటివి చేస్తే కఠినంగా శిక్షిస్తామని హెచ్చరిస్తున్నారు