Bharath Today

Around the World

ఏపీలో ఆ ఇద్దరు మంత్రులు రచ్చ రచ్చ.

ఆంధ్రప్రదేశ్ లో గత ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి ప్రవేశించడానికి కారణమైన జిల్లాలో ఇప్పుడు ఇద్దరు మంత్రుల మధ్య పోటీ రాజకీయ వాతావరణం వేడెక్కిస్తోంది.

ఇద్దరు నాయకుల మధ్య పోటీతో జిల్లాలో పార్టీ నిలువుల చీలిపోయాయి. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లాలో ప్రజలు గత కొంతకాలం ఎన్నికల్లో టిడిపికి పట్టం కట్టడంతో మెజార్టీ సీట్లు దొరికాయి. ఆ తర్వాత పాలకొండ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ టిడిపిలో చేరి పోయారు. ఈ మూడు సంవత్సరాల నుంచి మంత్రి అచ్చెన్నా హవా జిల్లాలో నడిచింది.

తర్వాత కళావెంకట్రావు ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా ఉండి మంత్రి అవ్వడంతో ఆయన తన గ్రూపు ను సపరేట్ గా మెయింటేన్ చేస్తున్నాడు. ఇప్పుడు చంద్రబాబు వచ్చిన కార్యక్రమాల్లో మినహా మిగిలిన కార్యక్రమాలు మంత్రులు ఇద్దరూ కలిసి పాల్గొనడం లేదు.  అచ్చెన్న కార్యక్రమానికి హాజరైతే కళావెంకట్రావు డుమ్మా కొడుతున్నారు.  కళావెంకట్రావు వస్తే అచ్చెన్నకార్యక్రమానికి రాడు వీరి దెబ్బతో  జిల్లాలో నాయకులు రెండుగా చీలిపోయారు.

రెండోసారి ఆంధ్రప్రదేశ్ లోటీడీపీకి ఎంపికైన కళా వెంకట్రావుకు స్వాగతం పలికిన వారిలో రాజాం పాలకొండ ఎచ్చెర్ల నియోజకవర్గంనేతలు అధికంగా ఉన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గ పరిధిలో ఉన్నవారు ఎవరు ఈ కార్యక్రమంలో పాల్గొన లేదువాస్తవంగా చెప్పాలంటే ఏపీ టీడీపీ అధ్యక్షు డిగా కళా  సెలక్ట్ అయ్యాడు.

ఆయన లోకేష్ కలిసి ఉండేవాడు రాష్ట్ర స్థాయిలో మంచి పేరు తెచ్చుకున్నారు. దీంతో అప్పటి వరకు జిల్లాలోచక్రం తిప్పిన అచ్చెన్న దీటుగా కళ కూడా రావడంతో ఇద్దరి మధ్య పోటీ వేడెక్కింది. సిక్కోలు టిడిపి  అంటున్నాఈ మంట  ఎప్పుడూ చల్లారిపోతుంది చూడాలి.

Bharath Today © 2018 Frontier Theme