ఒక్క రూపాయి కట్టకుండా ఆ హోటల్లో ఎంతైనా ఉచితంగా తినొచ్చు…!

news

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన కట్టడం దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా.. ఇక్కడకు వెల్లాలనీ దాని మీద ఎక్కి కిందకు చూడాలని చాలా మందికి ఉంటుంది. చాలా మంది ప్రపంచం నలు మూలల నుండి దాన్ని చూడటానికి వస్తారు.

కాని ఆ కట్టడం ఎంట్రీ ఫీజు ఉంటుంది… సామాన్య ప్రజలు బుర్జ్ ఖలిఫాను చూతానికి కర్చు పెట్టాల్సిందే. తక్కువ సంపాదన ఉన్నవారికి అక్కడకు వెళ్ళడానికి, కుటుంబంతో సహా తినడానికి తడిసి మోపెడవుతుంది.

అందుకే అక్కడ ఒక హోటల్ వినూత్నమైన ఆఫర్ ఇచ్చింది. ఆ హోటల్ లో కుటుంబంతో సహా వెళ్లి బుర్జ్ ఖలీఫా ను చూసి ఫ్రీగా భోజనం కూడా చేయోచ్చట. ‘బాంబినీ డైన్ ఫర్ ఫ్రీ’ అనే ఆఫర్ పేరిట ఈ వెసులుబాటును అందిస్తోంది. పదేళ్ల లోపు ఇద్దరు పిల్లలు, భార్యాభర్త.. మొత్తం నలుగురు ఉండే కుటుంబానికి ఈ ఆఫర్ వర్తిస్తుంది.

అర్మాని హోటల్ వారు అందిస్తున్న ఈ ఆఫర్ జూన్ 26 నుండి సెప్టెంబర్ 30 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫేర్ను వినియోగించుకోడానికి పెద్ద సంఖ్యలోనే రెగిస్త్రతిఒన్లు జరుగుతున్నాయట.