జగన్ కు ఆ విషయం తెలియదా…? బామ్మ బాగానే గడ్డి పెట్టిందిగా !

politics

జగన్ ప్రజా సంకల్ప యాత్ర పడుతూ లేస్తూ అన్నట్లుగా సాగుతోంది. పాదయాత్ర ద్వారా ఊహించని స్థాయిలో ప్రజల్లోకి దూసుకుపోవాలని .. అలాగే వచ్చే ఎన్నికల్లో సీఎం పీఠం ఎక్కేద్దామని తెగ కంగారు పడిపోతున్న ప్రతిపక్ష నేతకు ఊహించని ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. పార్టీ నాయకులు దెబ్బ మీద దెబ్బకొట్టి పార్టీ మారిపోతుండడం , మరోపక్క పాదయాత్రకు జనం నుంచి స్పందన లేకపోవడం ఆయనకు నిరాశే మిగులుస్తున్నాయి. ఈ పాదయాత్రలో ఓ పండు ముసలి బామ్మ కూడా జగన్ కు ఝలక్ ఇచ్చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి.

జగన్ కు ఎదురైనా ఈ పరాభవంలో వాస్తవం ఎంతుందో తెలియదు గాని ఈ వార్త మాత్రం బాగా పాపులర్ అయిపొయింది. ఇటీవల జగన్ తన పాదయాత్రలో కర్నూలు జిల్లా ఎర్రగుడి అనే గ్రామానికి వెళ్లారు. పాదయాత్ర కర్నూలు జిల్లా ఎర్రగుడి మీదుగా వెళ్తోంది. ఎర్రగుడి ఊరి చివర్లో ఓ ముసలమ్మ జగన్‌కు కనిపించింది. ఇంకేముంది జగన్ ఆగిపోయాడు. ఆ అవ్వను చూసి తన స్టయిల్ లో ఆమెను దగ్గరకు తీసుకుని తలపై ముద్దు పెట్టబోయాడు. కానీ ఆ అవ్వ అందుకు ఒప్పుకోలేదు.

ఆ అవ్వ చేతిలో చిన్నపాటి సంచి కూడా ఉంది. ఆ సంచిలో ఉడకబెట్టిన వేరుశనగ కాయలున్నాయి. వాటిని బయటకి తీసి అయ్యా ఇదిగో ఈ శనక్కాయల తిను అంటూ అవ్వ ఆ కాయలు జగన్ దోసిట్లో పోసింది. ఆ కాయలు చూసిన ఆయన అవ్వా.. శనక్కాయల కొన్నావా? అన్నాడు కాదయ్యా మా చేలో పండినవే అని చెప్పింది. బాగున్నాయే ఇవి .. బాగా పండిందా మీ చేను అన్నాడు. అవునయ్యా మా కయ్యిలో శానా బాగా పడింది. ఈయేడు పుట్లు…పుట్లు… పండాయి అన్నది. వానల్లేవుగా…. ఇంత బాగా ఎలా పండింది అన్నాడు జగన్.

వానా ఆడేందుకు మాకు పట్టిసీమ నీళ్లు వచ్చాయి కదా కాలువ నిండా నీళ్లు ఉన్నాయి అంది. పట్టిసీమ నీళ్లా.. ఏందవ్వో… నేనేమైనా పిచ్చోడ్నా యాడ పట్టిసీమా? యాడ ఎర్రగుడిపాడు ఎలా వస్తాయమ్మా పట్టిసీమ నీళ్లు అంటూ అవ్వ వైపు అమాయకంగా చూశాడు. ఆ మాట విన్న వెంటనే ఆ అవ్వ సుర్రుమంది. . ఓరి పిచ్చినాయనా? పట్టిసీమ ఎక్కడుందో నీకు తెలవకపోవచ్చు కానీ రాయలసీమ మొత్తానికీ ప్రతి బిడ్డకీ తెలుసు. సీమకు నీళ్లు ఎలా వచ్చాయో.? కాలవలు ఎలా పారుతున్నాయో, కాస్త తెలివి తెచ్చుకో నాయనా ఇంకా ఊళ్లో ఎక్కడా ఇలా అడగమాకు? జనం తిరగబడతారు. అంటూ ఆ అవ్వ జగన్ కు షాక్ ఇచ్చింది అట.
రాయలసీమకు పట్టిసీమ నీళ్లు ఎలా వస్తాయి.. ఇదీ తన పాదయాత్రలో జగన్ ప్రజలను అడుగుతున్న ప్రశ్న.. వాస్తవానికి పట్టిసీమ నీళ్లు రాయలసీమకు రావు కానీ పట్టి సీమ నుంచి వంద టీఎంసీలు కృష్ణా డెల్టాకు ఇవ్వడంతో శ్రీశైలంలో ఉన్న కృష్ణా నీళ్లు ఏపీ వాటా కింద రాయలసీమకు వాడుకునే అవకాశం దక్కింది. కానీ ఈ విషయాన్నీ జగన్ కావాలనే విస్మరిస్తున్నారు. అని ప్రజలు చర్చించుకుంటున్నారు.