• జగన్ ను మీడియా పట్టించుకోవడంలేదా ..? అందుకే పీకే ఈ ప్లాన్ వేశాడా..?

    Published December 7,2017 , 4:43 AM Posted By andhra

    జగన్ ను మీడియా పట్టించుకోవడంలేదా ..? అందుకే పీకే ఈ ప్లాన్ వేశాడా..?

    జనాల్లో సింపుల్ గా ఫ్యామస్ అయిపోదామనే వ్యూహాన్ని జగన్ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అమలు చేస్తున్నాడు. కానీ ఆ వ్యూహం సోషల్ మీడియా వేదికగా అభాసుపాలవుతోంది. వైసీపీకి వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ వచ్చిన తర్వాత ఆయన వేసిన మొదటి వ్యూహం సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయడం. ఇందుకోసం ఓ ప్రత్యేక వ్యవస్థను తయారు చేసాడు. దీనికి వైసీపీ సోషల్ మీడియా టీంను కూడా అనుసంధానం చేసి బాగా ప్రచారం చేస్తున్నారు. దీనికోసం ట్విట్టర్, ఫేస్‌బుక్‌ ఖాతాల్లో భారీ సంఖ్యలో అకౌంట్లు కూడా ఏర్పాటు చేసుకున్నారు.
     
    ఇంతే కాదు ఏపీలో ఉన్న అన్ని మీడియా సంస్థల్ని తన పాదయాత్ర ను పూర్తిస్థాయిలో  కవరేజ్ చేయాల్సిందిగా జగన్ విందు భోజనం పెట్టి మరీ వేడుకున్నాడు. అయితే అది పెద్దగా వర్క్ అవుట్ కాకపోవడంతో.. పేపర్, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రచారం సరిగ్గా లభించడంలేదు. దీంతో ఇప్పుడు ఆన్‌లైన్ వ్యూహం పన్నారు. జగన్ కోసం భారీగా ఖర్చు పెట్టి ఆన్‌లైన్ ప్రచారాన్ని ప్రారంభించారు. జగన్ వేసే ప్రతి అడుగును ఆన్‌లైన్‌లో చూసే ఏర్పాట్లు చేశారు. ఇలా అయినా జగన్‌కు యూత్‌లో ఫాలోయింగ్ వస్తుందని ప్రశాంత్ కిషోర్ బ్యాచ్ నమ్మకం.
     
    సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా జగన్ కనిపించేలా జగన్ వ్యూహకర్త  ప్లాన్ వేసుకున్నాడు. అందుకే ఫేస్‌బుక్, యూట్యూబ్‌, వాట్సాప్‌లో జగన్ హామీలు విస్తృతంగా ప్రచారం అయ్యేలా ప్రణాళిక వేసుకున్నాడు.  దీనికి  పీకే కొంచెం మసాలా దట్టించి మరీ జనాల్లోకి జగన్ వీడియోలు విడుదల చేసి రాజకీయ లబ్ది పొందడానికి ప్రయత్నిస్తున్నాడు. జగన్ చేపట్టిన పాదయాత్రకు సొంత మీడియాలో తప్ప ఎక్కడా కవరేజ్ రాకపోతుండటంతో ఈ ఎత్తుగడలకు తెర తీసాడు.
     
    ఈ విషయాలన్నీ కొంతసేపు పక్కన  పెడితే అసలు యాత్రలో జనం నుంచి ఎమన్నా స్పందన వస్తోందా అంటే లేదనే చెప్పాలి. మరి ఎందుకు వీళ్ళు అన్ని పాట్లు పడడం. అసలు నిజంగా ప్రజాభిమానం ఉంటే ఇవేమి లేకపోయినా అధికారం దక్కుతుంది. ఈ విషయం  జగన్ తొందరగా తెలుసుకుంటే మంచిది లేకపోతే పీకే ని నమ్ముకుని ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తే వచ్చే ఎన్నికల తరువాత పార్టీ పీకేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.