జూ..ఎన్టీఆర్ మామకి వైసీపిలో బెర్త్ ఫిక్స్

politics

నార్నే శ్రీనివాసరావు..స్టూడియో N చానెల్ ఛైర్మెన్..టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్.ఎన్టీఆర్ కి స్వయానా మామ..ఇప్పడు జూనియర్ మామ పేరు ఎందుకు బయటకి వచ్చింది అని అనుకుంటున్నారా..నార్నే.శ్రీనివాసరావు పొలిటికల్ ఎంట్రి చేయాలని ఎప్పటి నుంచో భావిస్తూ వచ్చారు..అయితే ఈ వార్తలు ఎప్పటికప్పుడు రావడం నార్నే అవకాశం కోల్పోవడం వంటివి జరుగుతూ వస్తున్నాయి..జూనియర్ 2009 ఎన్నిక‌ల్లో టిడిపికి ప్రచారం చేశారు..ఆ తరువాతా 2011లో ఎన్టీఆర్‌కు నార్నే కుమార్తె ల‌క్ష్మీప్ర‌ణ‌తితో పెళ్లి అయ్యింది..పెళ్లి తరువాత ఎన్టీఆర్ కి  బాలయ్య,బాబు లకి మధ్య గ్యాప్ బాగా పెరిగిపోయింది..దాంతో నరనేకి కూడా వారితో దూరం పెరిగింది.

నార్నే గత ఎన్నికల్లో గుంటూరు,కృష్ణ  జిల్లాల నుంచీ వైసీపి తరుపున ఎంపీ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు.. చాలా తీవ్రంగా టికెట్ కోసం ట్రై చేసినా చివరలో కొన్ని సమీకరణాల వల్ల టికెట్ రాకుండా పోయింది..అయితే మళ్ళీ నార్నే పొలిటికల్ మ్యాటర్ లో కొత్త కొత్త విషయాలు బయటపడుతున్నాయి. 2019 సాధార‌ణ ఎన్నిక‌ల్లో శ్రీనివాస‌రావు వైసీపీ నుంచి గుంటూరు జిల్లా చిల‌క‌లూరిపేట నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసే ఛాన్సులు ఉన్న‌ట్టు తెలుస్తోంది. అయితే చిలకలూరి పేట వైసీపి ఇన్చార్జిగా మర్రి శేకర్ ఉన్నారు. 2004లో ప్ర‌త్తిపాటి పుల్లారావు మీద గెలిచిన ఆయ‌న 2009లో కాంగ్రెస్ నుంచి…2014  ఎన్నిక‌ల్లో వైసీపీ   నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం ఆయన అనారోగ్య రీత్యా యాక్టివ్ గా ఉండటం లేదు.

 ఈ సమయంలో నార్ని. రాజశేఖర్ నియోజకవర్గంలో యాక్టివ్ గా తిరిగితే ఆయనకే సీటు వస్తుంది అనడంలో సందేశం లేదు అంటున్నారు.. మంత్రిగా ఉన్న ప్ర‌త్తిపాటిని ఢీ కొట్టాలంటే సామాజిక‌వ‌ర్గ ప‌రంగాను..ఆర్థికంగాను బ‌ల‌మైన వ్య‌క్తి అయిన నార్నే క‌రెక్ట్ అని వైసీపీ అధిష్టానం భావిస్తోంద‌ట‌. ఆయ‌న‌కు చిల‌క‌లూరిపేట టిక్కెట్ ఇస్తే పార్టీకి కూడా ఆర్థికంగా ఎంతో సాయం చేస్తాడ‌న్న‌ది వైసీపీ ప్లాన్‌. జగన్ కూడా నార్ని విషయంలో పాజిటివ్ గానే ఉన్నారని తెలుస్తోంది.నార్ని ఆశలు ఎంతవరకు సక్సెస్ అవుతాయి అనేది తెలియాలంటే  చివరి వరకూ వేచి చూడాల్సిందే