తన ఆత్మకధకి..డిఫ్ఫ్రెంట్ టైటిల్ పెట్టిన హీరో

movies

ఉపేంద్ర ఈ పేరు చెప్పగానే అందరికీ గుర్తుకువచ్చేది “A” సినిమా ఈ సినిమా ఎన్ని సంచలనాలు చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు..ఉపేంద్ర చేసిన ష్ , రా, హెచ్ టు ఓ, ఇలా అన్నీ డిఫరెంట్ గా ఉంటాయి..ఎప్పుడు సంచలనం లేనిదే సినిమాలు తీయని ఉపేంద్ర ఆ మధ్య రాజకీయ పార్టీ పెడుతున్నట్టుగా మీడియా ముందు ప్రకటించాడు..ఈ పార్టీకి “కర్నాటక ప్రగ్నాయవంత జనతా పక్ష” అనే పేరుని ఖారారు చేశారు..కన్నడ నాట ఇది పెద్ద సంచలనం అయ్యింది..ఆ సమయంలో ఉపేంద్ర చేసిన వ్యాఖ్యలకి తనపై కోర్టులో కూడా కేసు ఫైల్ అయ్యింది.

 అయితే సంచలనాలకి కేరాఫ్ అడ్రస్ అయిన ఉపేంద్ర ఇప్పుడు మరొక సంచలనానికి దారి తీశాడు..త్వరలో ఉపేంద్ర తన ఆత్మకథ పుస్తకాన్ని రిలీజ్ చేయబోతున్నారు.తన ఆత్మ కధకి టైటిల్ కూడా వెరైటీ గా పెట్టాడు  ఇదన్నా ఓడ్‌బేడిఅనే కన్నడ టైటిల్ తో ఈ పుస్తకం..విడుదలకి సిద్దంగా ఉంది అంటున్నాడు అయితే తెలుగులో ఆ టైటిల్ కి అర్ధం “డోంట్ రీడ్ దిస్” అని అర్థం అంటే ఎవ్వరు చదవకండి అని.

 ఉపేంద్ర జీవితంలో జరిగిన ముఖ్యమైన విషయాలని ఫోకస్ చేస్తూ ఈ ఆత్మకధ ఉంటుందని చెప్తున్నాడు.ఉపేంద్ర పొలిటికల్ మైలేజ్ కి హెల్ప్ అయ్యేలా ఈ పుస్తకం ఉంటుంది అని భావిస్తున్నారు అందరు..వరుస సినిమాలతో బిజీ గా ఉంటూనే దర్శకుడుగా కోడా సినిమా ప్లాన్ చేస్తున్నాడు.సుమారు 144 పేజీలు  ఉన్న ఈ పుస్తకంలో సంచలనాలకి మాత్రం కొదవు ఉండదని..ఈ విషయాలన్నీ తన పొలిటికల్ కెరియర్ కి హెల్ప్ అవుతాయని అంటున్నారు అభిమానులు..మరి ఉపేంద్ర ఆత్మకధ సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా తెలియాలంటే కొంతకాల వేచి చుడండి మరి.