• తెలుగుదేశం యాక్షన్ ప్లాన్ తెలిస్తే షాకింగ్

    Published October 5,2017 , 4:47 PM Posted By andhra

    తెలుగుదేశం యాక్షన్  ప్లాన్ తెలిస్తే షాకింగ్

    తెలుగుదేశం అంటేనే కమ్మ కులం అనిగుర్తుకొస్తుంది. అది ఒక విధంగా టిడిపికి ప్లస్ అవుతుంది. మరొక విధంగా మైనస్ అవుతుంది. టిడిపి ప్రభుత్వం కమ్మ వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. మిగతా వర్గాలకు ఆ పార్టీ దూరంగా ఉంటుంది. ఇప్పుడైతే టిడిపి ప్రభుత్వం కమ్మ కులం వారి నుంచి బయటకు రావాలని అనుకుంటుంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే జగన్ సామాజిక వర్గంపై ప్రత్యేకంగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది.

    రాయలసీమలో రెడ్డి వర్గాల నాయకులపై అధికార పార్టీ గురిపెట్టి మరొక ఆపరేషన్ కు ప్లాన్ చేసింది. వైసిపిలో ఉన్న రెడ్డి నాయకులందర్నీ బయటకు లాగేసి ఆ పార్టీని ఇబ్బందులలో పెట్టాలని భావిస్తుంది. టి.డి.పీ నంద్యాల ఎన్నికల్లో అత్యంత మెజారిటీతో విజయం సాధించింది..! కదా దీనివల్ల చంద్రబాబు అండ్ కో సీమకు చెందిన నాయకులను తన వైపు తిప్పుకోవడం తన లక్ష్యంగా పెట్టుకుందని భావిస్తున్నారు.
    దీనికంటే ముందు ఆకర్ష పథకాన్ని అమలు చేసేలా కొంత మంది టిడిపి నాయకులకు బాధ్యతలు అప్పగించారట, రాయలసీమలో రెడ్డి వర్గాన్ని తమ వైపు తిప్పుకోవాలని ఆ వర్గానికి చెందిన నేతలను పార్టీలు పార్టీలో పెద్దపీట వేయాలని అంటున్నారు. టిడిపిలోకి వచ్చిన రెడ్డి వర్గాల నాయకులను గుర్తించి ఆహ్వానించడం స్థానిక పార్టీల నాయకులతో సయోధ్య కుదర్చడం వంటి పనులను టిడిపి సీనియర్ నాయకులు అప్పగించారట.

    మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అమనారాయణరెడ్డికి ఆకర్ష పథకాలు బాధ్యత ఇచ్చినట్లు చెపుకుంటూన్నారు.
    ఇప్పటికే రాయలసీమకు చెందిన రెడ్డి వర్గాల జాబితా ఒకటి రెడీ అయింది. ప్రస్తుతమున్న మంత్రులంతా ఇక తమ శాఖల్లో పనులు సైతం మానుకొని బాబుగారి చేపట్టిన లక్ష్యాలపై మక్కువ ఎక్కువగా చూపిస్తున్నారు.
    రాజకీయాల్లో ఏళ్ల తరబడి చక్రం తిప్పి వాళ్ళు ఇప్పుడు మెదలకుండా ఉన్న నాయకులపై టి.డి.పీ దృష్టి పెట్టింది. ప్రజలలో వీరిపై ఎలాంటి అభిమానం ఉందో అని తెలుసుకుంటూ ఒక లిస్టు తయారు చేశారట. టి.డి.పీ ఇప్పటికే మాజీమంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి టిడిపికి వస్తున్నారని ప్రచారం జరుగుతుంది. ఆయన పార్టీలోకి వస్తే మైదుకూరు నియోజకవర్గం దానితోపాటు కడప జిల్లాలోని కొన్ని ప్రాంతాలు టిడిపికి బలాన్ని ఇస్తాయని అంచనా వేస్తున్నారు. మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి యొక్క దృష్టి అంతా కర్నూలు జిల్లా పై పెట్టారని అంతే కాకుండా ఈ మధ్యకాలంలో జరిగిన నంద్యాల ఎన్నికల్లో ఆయన కీలకపాత్ర పోషించారని చెప్పవచ్చు.

    ఇప్పుడు బైరెడ్డిని టిడిపిలోకి ఆహ్వానించాలని కర్నూలు జిల్లాలో రెడ్డి వర్గం యొక్క మద్దతు పెరుగుతుందని వారి అంచనా మరోక వైపు మంత్రి అమర్నాద్ రెడ్డి ప్రస్తుతం చిత్తూరు జిల్లా పై దృష్టి పెట్టారు. ఎందుకంటే చిత్తూరు జిల్లా మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి పచ్చ కండువా కప్పేందుకు అమర్నాద్ రెడ్డి చర్చలు జరిపారని. దీనికితోడు అనంతపురం కర్నూలు జిల్లాలకు చెందిన ఇతర నేతలపై కూడా ఈ మంత్రులు దృష్టి పెట్టారు. వీళ్లకు సంబంధించిన లిస్టు చంద్రబాబు ఫైనల్ చేస్తున్నారని తెలిపారు.