Bharath Today

Around the World

దీపావళి పండగ వెనుక ఉన్న రహస్యలు తెలుసా?

మనం జరుపుకునే పండుగలలో ఎక్కువగా చెడుపై మంచి సాధించిన తర్వాత విజయానికి గుర్తుగా జరుపుకునే పండుగ దీపావళి. దీపావళి అంటే మనకు కృష్ణ భగవానుడు నరకాసురుని సంహారం మాత్రమే అని మనలో చాలామందికి తెలుసు కానీ దీపావళి రోజు ప్రాధాన్యత ఎన్నో విషయాలతో ముడిపడి ఉంది. అవన్నీ ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు.

దీపావళిలో దీప అనగా కాంతి లేక దీపము అని అర్థం కావాలి అనగా వరుస అని అర్థం దీపావళి అనగా పూర్తి పేరు అర్థం దీపాల వరుస మన దేశంలో చాలా చోట్ల ఇది నాలుగు రోజుల పండుగ., ఇక దీపావళి రోజు కు సంబంధించి ఎన్ని విషయాలు ఉన్నాయో చూడండి. మనకందరికీ తెలిసిందే శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రంతో నరకాసురుని సంహరించినందుకు గుర్తుగా జరుపుకోవడం.

దేవతలు రాక్షసులు అమృతం కోసం పాలసముద్రాన్ని మధించినప్పుడు అందులోనుంచి లక్ష్మీదేవి బయటకు వచ్చిన సందర్భంలో జరుపుకునేది.

రాముడు రావణుని సంహరించి అయోధ్యకు వచ్చిన రోజు.

12 సంవత్సరాల వనవాసం తర్వాత పాండవులు తమ రాజ్యానికి తిరిగి వచ్చిన రోజు ఆరోజు ప్రజలందరూ తమ ఇండ్లను విధులను దీపాల అలంకరణతో వారికి స్వాగతం పలికిన రోజు.

జైనుల తీర్థంకరుడు మహావీరుడు మహా సమాధి అయిన రోజుఅందువలన జైనులు కూడా వేడుకగా ఈ పండుగను జరుపుకుంటారు.

సిక్కులకు సంబంధించినది అమృతసర్ లో గోల్డెన్ టెంపుల్లో పునాది రాయి వేసిన రోజు.

స్వామి దయానంద సరస్వతి సమాధి అయిన రోజు మరి దీపావళి  ప్రతి సంవత్సరం వేర్వేరు రోజుల్లోఎందుకు జరుపుకుంటారు.

దీపావళి లూనార్ క్యాలెండర్పైఆధారపడి ఉంటుంది అంటే చంద్రుడి కదలిక ఆధారంగా వచ్చే పండగ అన్న మాట.

 

దీపావళి రోజు దీపాలు ఎందుకు వెలిగిస్తారో చూద్దామా

మన పురాణాల ప్రకారం మంచికి గుర్తు ‘కాంతి’ చెడుకు గుర్తు ‘చీకటి’ చెడుపై మంచి కి గుర్తుగా చీకటిని పారద్రోల డం కోసం దీపాలు వెలిగిస్తారు.

ఇక దీపాలు వెలిగించడం బాణసంచా కాల్చడం వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏమిటో చూద్దామా

శీతాకాలంలో పురుగులు క్రిమికీటకాలు దోమలు సముదాయం చాలా ఎక్కువ మనం దీపాలు వెలిగించి బాణాసంచా కాల్చినప్పుడు అవి ఆ వెలుగుకు ఆకర్షింపబడి దగ్గరకు వచ్చి ఆ మంటల్లో చాలా వరకు చనిపోతాయి.

ఇది దీపావళి పండుగ వెనుక ఉన్న మొత్తం చరిత్ర  దాదాపు అన్నిమతాలకు సంబంధించిన జాతీయ పండుగ ఈ పండుగ ప్రాధాన్యత అందరికీ తెలిసేలా షేర్ చేయండి.

Updated: December 29, 2017 — 8:23 am
Bharath Today © 2018 Frontier Theme