పెళ్లైన అమ్మాయిలు రెండు జడలు ఎందుకు వేసుకోకూడదంటే?

bhakti

మన ఆచారం ప్రకారం అమ్మాయిలు రెండు జడలు వేసుకున్నారు అంటే ఇంకా వివాహం కాలేదు అని అర్థం. ఒక జడ వేసుకుంటే వివాహం అయ్యింది అని అర్థం. అదే ముడి వేసుకుని కొప్పు పెట్టుకుంటే సంతానం ఉన్నవారు అని అర్థం. అమ్మాయిల ఆహార్యాన్ని బట్టి వివాహితులా? కాదా? అనేది గ్రహించవచ్చును. త్రివేణి అంటే మూడుపాయలుగా అల్లుకుంటేనే జడ అవుతుంది. ఒక పాయ భార్య, ఒక పాయ భర్త.. ఒక పాయ సంతానంగా భావిస్తారు.

ఈ ఆచారాలు మన పుస్తకాల్లో రచించి లేనప్పటికీ మన ధర్మంలో ఎప్పటినుంచో ఉన్నాయి. వాటిని గౌరవించడం.. పాటించడం మన మన సంప్రదాయం. వాటిని గౌరవించడంలో భాగంగానే పెళ్లైన వారిని రెండు జడలు వేసుకోవద్దని మన పెద్దలు.. ఇంట్లో వారు చెబుతారు. పెద్దలు చెబుతుంటే మనకి కోపం వస్తుంది కానీ.. దీని వెనుక ఇంత పరమార్థం ఉందని ఇప్పటివారు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.