ప్రకాశం జిల్లాలో డెంగ్యూతో ముగ్గురు చిన్నారులు మృతి

taajavarthalu

వాతావరణం మారిపోవడం వల్ల దేశంలో పలు రోగాలు అధికంగా కమ్ముకుంటున్నాయి. అయితే మలేరియా డెంగ్యూ వంటి మహoమ్మారి విషజ్వరాలు మరలా, క్యూ కట్టాయి. వీటిద్వారా చాలామందికి ప్రాణహాని కలుగుతున్నాది. ఇటీవల ప్రకాశం జిల్లాలో డెంగు వ్యాధి విస్తరిస్తోంది.

అంతేకాక ఈ వ్యాధికి గురైనవారు ముగ్గురు గతవారంలో చనిపోయారు. మరికొందరైతే ఈ వ్యాధి నుండి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
అయితే దర్శి మండలం శివరాజ్ నగర్ లో మూడు సంవత్సరాల బాలిక శృతి డెంగ్యు జ్వరంతో చనిపోయింది.

అలాగే బెస్తవారిపేట మండలం, కాజీపురం లో ఎనిమిది నెలల చిన్నారి ఈ వ్యాధితో చనిపోయింది. శుక్రవారం మరొక ముగ్గురు చిన్నారులు డెంగ్యు అనే మహo మ్మారి జ్వరంతో చనిపోయినట్లు సమాచారం తెలిపారు. ఇలా జిల్లాలో రోజుకు ఒకరైన చనిపోవడంతో అక్కడ ప్రజలు ఆందోళన చెందుతున్నారు.