• ప్రపంచ సుందరి ఆ హీరోకి ఫ్లాట్ అయ్యిపోయింది

    Published December 4,2017 , 8:06 AM Posted By andhra

    ప్రపంచ సుందరి ఆ హీరోకి ఫ్లాట్ అయ్యిపోయింది

    ఎన్నో ఏళ్ల తరువాత మళ్ళీ ఇండియా తరుపున ప్రపంచ అందాల పోటీలలో అందాల కిరీటాన్ని సొంతం చేసుకున్న ఇండియన్ బ్యూటీ మానుషి సుమారు.. 17 ఏళ్ల తరువాత అంతర్జాతీయ వేదికమీద మళ్ళీ భారతీయ అందం మెరిసింది..ఆమె పేరే మానుషి చిల్లార్.. 21 ఏళ్ల మానుషి ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షించింది..ప్రియాంకా తరువాత ఆ కిరీటాన్ని చేజిక్కించుకున్న మహిళగా వార్తల్లో నిలిచింది.

     మానుషి తలపై అందాల కిరీటం పెట్టగానే యావత్ భారతీయ యువతీ యువకులు ఎంతో సంతోష పెడ్డారు..డాక్టర్ చదువుతూ చిన్నప్పటి నుంచీ విశ్వ సుందరి అవ్వాలనే కోరికతోనే ఉండేదానిని అంటూ చెప్పుకోస్తోంది..ఇప్పుడు మానుషినే హాట్ టాపిక్..ఇప్పుడు మానుషి చేసిన ఒక కామెంట్ సంచలనం అవుతోంది.ఇప్పుడు ఆమె కామెంట్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి.

     21 ఏళ్ల మానుషి న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ..మీడియా వారు వేస్తున్న ప్రశ్నలకి సమాధానంగా తనకి సినిమాలలో నటించే ఆసక్తి లేదని..ఒక వేళ నటించే అవకాశం వస్తే మాత్రం తానూ జట్టు కట్టేది మాత్రం అమీర్ ఖాన్ తోనే అని చెప్పేసింది. అమీర్ ఖాన్ అంటే తనకు ఎంతో ఇష్టం అని..ఆయన సినిమాలు ఎంతో వైవిధ్యంగా ఉంటాయని తెలిపింది.నిజంగా ఆ అవకాశం వస్తే మాత్రం వదులుకోను అంటూ అమీర్ మీద తనకున్న కోరికని బయట పెట్టింది.. మరి అమీర్ ఖాన్ ఈ విషయంలో ఎలా స్పందిస్తాడో వేచి చూడాలి మరి.