ప్లాస్టిక్ బాటిల్ నీళ్ళు త్రాగితే ఎంత డేంజర్ తెలుసా

Do you know how much of a danger of plastic bottle water?

ప్లాస్టిక్..ప్లాస్టిక్.. ఎక్కడ చూసినా ప్లాస్టిక్ మయమే..ప్రపంచ వ్యాప్తంగా ప్లాస్టిక్ వాడని దేశం..లేదా ఊరు చూపించమంటే అసాధ్యం. ఇది నిత్య వస్తువు అయ్యింది..కానీ ప్రపంచంలో గ్లోబల్ వార్మింగ్ కి అసలు కారణం ప్లాస్టిక్ అని చాలా మందికి తెలియదు.. ఎక్కువ మంది ప్లాస్టిక్ ని వినియోగించేది ఎక్కవగా మంచి నీటి కోసమే.. నీళ్ళ కోసం ఈ బాటిల్డ్‌ వాడకం ఈ మధ్య కాలంలో ఎక్కువైంది. రుచిగా ఉన్నాయని, మినరల్స్‌ ఎక్కువగా ఉన్నాయని.. అన్నింటినీ మించి సురక్షితమైన నీరని బాటిళ్లను కొంటున్నాం. కానీ ఆ బాటిల్‌ నీరు.. అతి ప్రమాదకరం. రుచిగా ఉండేందుకు వాటర్‌ కంపెనీలు.. పలు రకాల రసాయనాలు, చక్కెరలను కలుపుతున్నాయి. అంతే కాదు ప్లాస్టిక్‌ బాటిళ్ల నుంచి హానికారకమైన విష రసాయనాలు విడుదలవుతుంటాయి.

బాత్రూం లో ఉండే టాయిలెట్ సీటులో ఎన్ని సుక్ష్మ క్రిములు ఉంటాయో.. ప్లాస్టిక్ బాటిల్ మీద అంతకంటే ఎక్కువ క్రిములు ఉంటాయట. చేతులు కడగకుండా బాటిళ్లను వాడడం, తరచూ క్లీన్‌ చేయకపోవడం వల్లే.. దానిపై బ్యాక్టీరియా పెరుగుతుంది. బాటిల్‌ నెక్‌ పైనే బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది. అలాంటి నీటిని తాగితే హైపటైటి్‌స-ఏ వంటి రోగాలు వస్తుంటాయి. అంతేకాదు ప్లాస్టిక్‌ బాటిళ్లకు వేడి తగిలినా, ఆక్సిజన్‌తో చర్య జరిపినా.. అతి ప్రమాదకర రసాయనాలను విడుదల చేస్తాయట .

అయితే ఈ బాటిళ్లను కూడా వెనిగర్‌, యాంటీ బాక్టీరియల్‌ మౌత్‌ వాష్‌లతో తరచూ క్లీన్‌ చేస్తూ ఉండాలి.అసలు బాటిల్ నీళ్ళు త్రాగాకపోవడమే మంచిది అని నిపుణులు సలహా ఇస్తున్నారు.ఇంట్లో నీళ్ళని కాచి వడపోసి త్రాగడం అన్నిటికంటే ఉత్తమం..బయట డబ్బులు పెట్టి కొనుక్కునే కంటే కాచి వడపోసిన నీరు త్రాగటం శ్రేయస్కరం అని వైద్యుల సూచన

Bharath Today
Assign a menu in the Left Menu options.