బాణాస౦చా పేల్చితే కఠిన చర్యలు

taajavarthalu

దీపావళి పర్వదినం సందర్భంగా దేశం మొత్తం రంగురంగుల కాంతులతో వెలిగిపోతుంది అయితే ఈ పండుగను అందరూ జరుపుకుంటుంటారు. కాని సంతోషంతో జరుపుకునే సమయంలో పిల్లలకు పెద్దవారికి ప్రమాదాలు జరుగుతుంటాయి.అందుకు గాను ఈ దీపావళి పండుగా వస్తుందంటే అధికారులు ముందుగా జాగ్రత్తలు తీసుకుంటారు.

ఈ నేపథ్యంలో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో మూడురోజులపాటు ఆంక్షలు విధిస్తున్నట్లు సి .పీ మహేందర్ రెడ్డి ప్రకటన చేశాడు. ఈనెల 17 నుంచి 20 వరకు జంట నగరాల్లో బహిరంగ ప్రదేశాల్లో బాణ సంచ పేల్చితే వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఎవరైనా చట్టవిరుద్ధంగా చేస్తే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం శిక్ష అమలు చేస్తాము అని తెలిపారు.