బాలకృష్ణ ఆగ్రహానికి మరొక కార్యకర్త చెంపదెబ్బ

బాలకృష్ణ ఆగ్రహానికి మరొక కార్యకర్త చెంపదెబ్బ

హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరొకసారి కోపానికి లోనయ్యారు హిందూపురంలో ఒక వ్యక్తి పై చేయి చేసుకున్నారు. అందరూ చూస్తుండగానే బాలకృష్ణ అలా చెంపమీదకొట్టడం అందర్నీ దిగ్భ్రాంతికి గురిచేసింది. అభిమానులపై అలా చేయి చేసుకోవడం బాలయ్య తీరును అందరూ తప్పుబడుతున్నారు.

హిందూపురం నియోజకవర్గం లో బాలకృష్ణ ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్నారు.
బోయపేటలో ఇంటింటికి తిరుగుతున్న క్రమంలో బాలకృష్ణను దాటి ముందుకు వెళ్లేందుకు ఓ కార్యకర్త ప్రయత్నించాడు దానికి బాలకృష్ణకి కోపం వచ్చి వెంటనే చెంప మీద కొట్టాడు. దీంతో అక్కడ ఉన్నవారందరూ ఆశ్చర్యపోయారు. వెంటనే అతడిని ప్రక్కకు తీసుకొనిపోయి బాధితులను ఓదార్చారు కొట్టిన తర్వాత బాలయ్య కూడా కాసేపు అతడి వైపు ఆగ్రహంగా చూస్తుండి పోయాడు.
చివరకు ప్రక్కన ఉన్న వాళ్ళు అతనిని తీసుకువెళ్లిపోయారు, బాలయ్య ఏదో విధంగా ముందుకు వెళ్లి ఆ కార్యక్రమాన్ని కంటిన్యూ చేశారు. బాలయ్య అభిమానులపై కార్యకర్తల పై చేయి చేసుకోవడం వింత ఏమి కాదు. అని గతంలో కూడా అనేకసార్లు ఇలా బాలకృష్ణ కోపానికి ఇబ్బంది పడ్డారని సినిమా షూటింగ్ సమయంలోనూ ఇటు పార్టీ కార్యక్రమాల్లో చాలాసార్లు అభిమానులపై చేయి చేసుకున్నారని తెలిపారు. దీనివల్ల బాలకృష్ణ అనేక విమర్శలు ఎదుర్కుంటాడు అని అంటున్నారు.