భార్య భర్తలు చేయకూడని తప్పులు మీకు తెలుసా?

ప్రస్తుతం ఉన్న రోజుల్లో మనుషులు ఒకరినొకరు పట్టించుకునే టైం కూడా దొరకడంలేదు. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలకు వెళ్లిపోవడం వలన ఆఫీసులో ఉన్న వత్తిడి సాయంత్రానికి అలసిపోయి ఉంటారు. కొందరు దంపతులు అయితే ఒకరు పగలు ఉద్యోగానికి వెళతారు మరి ఒక్కరు నైట్ ఉద్యోగాలకి వెళతారు.

కొందరి జీవితంలో కలసి మాట్లాడుకునే తీరిక కూడా ఉండదు. దీన్నిబట్టి దంపతులు ఇద్దరూ మనసు విప్పి ప్రేమగా మాట్లాడుకునే సమయం కూడా ఉండదు.

ఇది చాలదన్నట్లు కొన్ని తప్పులు చేయకుండా ఉండలేరు

ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మొబైల్ ఫోన్ ఆడుకోవడం, మొబైల్ చూస్తు నిద్ర పోవడం జరుగుతుంది, ఇక ఇది చాలదన్నట్లు సోషల్ మీడియా వలన స్మార్ట్ ఫోన్ వలన చాలా మంది భార్యాభర్తలు గొడవలకు దారి తీస్తుంది.

అవును ఒకసారి నిద్రించే ముందు మీ భార్యతో మనసు విప్పి మాట్లాడటానికి ప్రయత్నించండి. ఇలా చేస్తే మీ మనసు ప్రశాంతంగా ఉంది హాయిగా నిద్రపోతారు.

భార్యాభర్తలు ఇద్దరూ ఒకే సారి నిద్రపోవడానికి ప్రయత్నించండి, అంతే కానీ భార్య నిద్రపోవడానికి వస్తే భర్త తన పనిలో ఉండటం లేదంటే భర్త నిద్రపోవడానికి వస్తే భార్య వంటింటిలో పని చేసుకుంటూ ఉండటం మంచిది కాదు. ఇద్దరూ ఒకేసారి నిద్రించటానికి అలవాటు చేసుకోవడం మంచిది.

నైట్ టైం నిద్రించడానికి ముందు భార్యాభర్తలు ఇద్దరూ కలసి భోజనం చేయడం టీవీ చూడడం ఇలా చేయడం మంచిది.

ఒకరి సంతోషాలను ఒకరికొకరు షేర్ చేసుకోవాలి, బెడ్రూమ్ లోకి అడుగు పెట్టాక మరి ఏ పనులను గురించి ఆలోచించవద్దు.

భార్యాభర్తల మధ్య మనస్తాపాలు వచ్చినప్పుడు బెడ్ రూమ్ వాటి గురించి ప్రస్తావించడం మంచిది కాదు ఇలా చేయడం ద్వారా మనస్తాపాలు తగ్గి ప్రేమగా ఉంటారు.

సాధారణంగా పిల్లలు పుట్టినతరువాత భార్యాభర్తల మధ్య దూరం పెరుగుతోంది, అయితే పిల్లల్ని ఒక ఏజ్ వచ్చేదాకా వారికంటూ ఒక రూం ఏర్పాటు చేసి వేరుగా పడు కునే విధంగా అలవాటు చేయాలి, ఇలా చేయడం వలన భార్యాభర్తల మధ్య సంబంధం హ్యాపీగా సాగుతుంది.

పెంపుడు జంతువులు ఇంట్లో ఉండటం వలన ఎక్కువ మందికి సరైన నిద్ర ఉండదు.

ముఖ్యంగా పడుకునేముందు భర్త మందు తాగడం సిగరెట్ తాగడం వంటివి చేస్తారు కానీ అలా చేయడం భార్యకు అసలు ఇష్టం ఉండకపోవచ్చు కాబట్టి పడుకునేముందు ఆల్కహాల్కు దూరంగా ఉండటం మంచిది.

భార్యాభర్తలు పడుకునే ముందు ఒకరికొకరు బాడీ మసాజ్ చేసుకోవడం వలన బంధం బలపడుతుంది, ఆందోళన వత్తిడికి దూరం కావడం జరుగుతుంది.

పడుకునే ముందు భాగస్వామికి ముద్దు పెట్టడం కౌగలించుకోవడం లాంటి చిన్న చిన్న పనులే ఒకరితో ఒకరిని మరింత దగ్గర చేస్తాయి

Bharath Today
Assign a menu in the Left Menu options.