‘మహాత్మా’గా ప్రపంచం మదిలో నిలిచిన “భారతశక్తికి” BharathToday ఘననివాళి.

'మహాత్మా'గా ప్రపంచం మదిలో నిలిచిన “భారతశక్తికి” BharathToday  ఘననివాళి.

గాంధీ అంటే ఒక శాంతి సందేశం,
గాంధీ అంటే ఒక సామరస్యం,
గాంధీ అంటే ఒక శైలి,
గాంధీ అంటే ఒక సాధన,
గాంధీ అంటే ఒక మేధస్సు,
గాంధీ అంటే ఒక అభయం,
గాంధీ అంటే ఒక పోరాటం,
గాంధీ అంటే ఒక ఉప్పెన,
గాంధీ అంటే ఒక జాతి స్వాతంత్రం,
గాంధీ ఒక సత్యం,
గాంధీ అంటే ఒక అలుపెరగని జీవిత ప్రయాణం,
గాంధీ అంటే జాతి అతున్నత ప్రమాణం,

ఈ భారతావనిలో గాంధీ ఒక పేరు కాదు, ఒక జాతిని ఏకం చేసిన వ్యక్తి, భారత జాతి స్వేచ్ఛ స్వాతంత్య్రం కోసం పోరాడి గెలిచిన ధీరుడు, ఆశయ సాధనలో రక్తం చిందించివలసిన అవసరం లేదని ప్రపంచానికి చాటి చెప్పినారు సాధారణ వ్యక్తి, అలుపెరగని బాటసారి ఒక ఆశయ సాధనలో కొన్ని కోట్లమంది భారతీయులు ఏకతాటిపైకి తెచ్చి సంస్కారాన్ని, సత్యాన్ని, అహింసను, నీతిని, నిజాయితీని ప్రపంచానికి పరిచయం చేసిన ధీశాలి.

గాంధీయ వాదం యావత్ మానవాళికి కాంతి వైపు నడిపించిన దిక్చూచి…..,

భారతీయులకు గౌరవం, మర్యాద, ఆత్మగౌరవం తీసుకువచ్చినా నాయకుడు మనిషి నడవడికి నిర్వచనం చెప్పిన నాయకుడు, సమాజంలో అసమానతలు మూఢనమ్మకాల్ని హింసని పారద్రోలిన సంఘసంకర్త అత్యున్నత జీవన ప్రమాణాలు పాటిస్తూ ఎన్నో కోట్ల మంది భారతీయులకు నిర్వచనంగా నిలిచిన జాతిపిత. “పరోపకారం ఇదం శరీరం” అని చెప్తూ పాటిస్తూ, అహర్నిశలు తన జీవితాన్ని ధారపోసిన నాయకుడు. కోట్లమంది భారతీయులు ప్రేమగా పిలుసుకొనే జాతి పిత “అంటే తండ్రి”.
మహాత్మాగా ప్రపంచం మదిలో నిలిచిన “భారతశక్తికి” BharathToday ఘననివాళి.