ముంబై మహిళ కిడ్నీలో కణిత బరువు 5.5 కేజీలు

taajavarthalu

ముంబై లో నివసిస్తున్న మంజుదేవి ఆమెకు 23 సంవత్సరాలు గత మూడు సంవత్సరాలుగా కిడ్ని వద్ద ఒక పెద్ద కణిత రావడం వల్ల ఎంతో బాధ పడుతున్నారు. తన కిడ్నీ లో ఉన్న కణిత 50 రెట్లు ఎక్కువ భారీ పరిమాణం కలిగి ఉండటం వల్ల శరీరావయవాలు కొంత బలహీనత ఏర్పడి, ఆమె ఏ పనిని చేసుకోలేక పోతుంది.

ఇటీవల భారతీయ డాక్టర్లను సంప్రదించినప్పుడు వారుఅన్ని పరిక్షలు చేసి న తరువాత, దాదాపు ఎనిమిది గంటలపాటు ఆపరేషన్ చేసి ఆ కణితను బయటకు తీశారు. ఆ కణిత యొక్క బరువు దాదాపు 5.5 కేజీలు ఉందని డాక్టర్లు తెలిపారు. ఇప్పటి వరకు కిడ్నికి ఏర్పడిన కణితలు చూస్తే, ప్రపంచంలో ఇదే అతిపెద్ద కణిత అని తెలియజేశారు. ఆపరేషన్ చాలా కష్టంగా ఉంటుందని మంజుదేవి ఇంత వరకూ వైద్యుల దగ్గరకు వెళ్లలేదని పేర్కొంది. ఇది మేజర్ సర్జరీ అవడంతో అన్ని రికార్డులు తీసుకుని తర్వాత శస్త్ర చికిత్స చేయిoచుకుంది అని తెలిపారు.