• రాజ్యసభకి వెళ్ళాలని ఉంది…కానీ

    Published December 4,2017 , 8:15 AM Posted By andhra

    రాజ్యసభకి వెళ్ళాలని ఉంది...కానీ

    యనమల రామకృష్ణుడు ఈ పేరు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు..రాజకీయాల్లో సుమారు 35 ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తి.. ఎన్నూ ఒడిదుడుకులు ఎదుర్కుని రాజకీయంగా తనకంటూ ఒక ఇమేజ్ సంపాదించుకున్న ఆయన ప్రస్థానం తుని నుంచీ మొదలయ్యైంది..తుని యనమలకి కంచుకోట 2004 వరకు పోటీ చేసిన ప్రతీ సారి ఆయన గెలుపు నల్లేరు మీద నడకలా సాగింది..తరువాత 2009లో ఓటమిని చవిచూసిన యనమలకి చంద్రబాబు బాసటగా నిలిచారు 2013 లో ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి ఆర్ధిక మంత్రిని చేశారు  బాబు.

     ఈ మధ్య యనమల రాజ్యసభకి వెళ్తున్నారు అని వార్తలు వచ్చాయి..చంద్రబాబు కూడా యనమలకి అవకాశం కలిపించి పెద్దల సభకి పంపాలి అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది..ఇదే విషయమై యనమాలని అడుగగా చంద్రబాబు అవకాశం కల్పిస్తే వెళ్ళడానికి నాకు అభ్యంతరం లేదు అంటూనే మనసులో మాట బయట పెట్టారు..నేను సిద్దం మరి అధిష్టానం ఏమి నిర్ణయం తీసుకుంటుందో తెలియాల్సి ఉంది అన్నారు యనమల.

     అయితే అధిష్టానం ఎంటువంటి నిర్ణయం తీసుకున్నా సరే నేను పాటిస్తాను అని..మాకు బిగ్ బాస్ మాత్రం అధిష్టానం అని చెప్పుకొచ్చారు..తానూ ఎక్కడ ఉండాలి అనేది బాబు నిర్ణయం అని నా ఒక్కడి నిర్ణయం కాదని తెలిపారు..పార్టీలో నాకు ఏది కావాలో ఎప్పుడు అడగలేదని నా నిజాయితీనే నన్ను కాపాడుతూ వస్తోందని తెలిపారు యనమల.మరి రాజ్య సభకి వెళ్ళాలని ఆరాటపడుతున్న యనమల కోరికని బాబు తీరుస్తారో లేదో తెలియాలంటే  కొంతకాలం వేచి చూడాల్సిందే..