సిగరేట్ షాపుల్లో ఇక అవి దొరకవు

taajavarthalu

పొగ త్రాగడానికి యువకులు ఎక్కువగా ఆకర్షితులవుతుంటారు.  వారిని అదుపులో ఉంచడానికి కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. సిగరేట్ షాపుల్లో బిస్కెట్లు సాఫ్ట్ డ్రింక్సు చికిత్స వంటి ఇతర ఉత్పత్తులు అమ్మకుండా నిషేధించాలని  నిర్ణయం తీసుకున్నారు, దీంతో సిగరేట్ వాడకానికి కొంత దూరంగా ఉండవచ్చునని తెలియజేశారు.

సిగరేటు ను అమ్మే షాపుల్లో ఈ నిబంధనను తప్పనిసరిగా పాటించాలని నిర్ణయించింది. ఇతర పొగాకు ఉత్పత్తులకు కూడా  లీగల్ అథారిటీల వద్దా రిజిస్టర్ నిబంధనలు కూడా తీసుకొచ్చారు. ఈ దుకాణాలు తప్పనిసరిగా రిజిస్టర్ అయి ఉండాలి.స్థానిక మున్సిపల్ అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలి ఉంటుంది.

కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమం ఆర్థిక సలహాదారు తెలియజేశారు. దేశవ్యాప్తంగా  నడుస్తున్నా అన్నీ సిగరేట్ షాపులను ప్రభుత్వం గుర్తిస్తుందని చెప్పారు. చిన్నపిల్లలకు కూడా పొగాకు ఉత్పత్తులు నిషేధించడానికి కూడా తప్పనిసరిగా చర్యలు తీసుకుంటున్నారు.

ఈ నిబంధనలపై తాను పంపిన లేఖలకు రాష్ట్రాలు అనుకూలంగా స్పందించినట్లు తెలియజేశారు. ప్రస్తుతం వీటిని ఎలా అమలు  చేయాలి అని చెప్పారు. పొగాకు వాడకాన్ని నిర్మూలించే క్రమంలో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.