సైనెడ్ మోహన్ కు జీవిత ఖైదు

taajavarthalu

ఆడవాళ్లపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. ఎక్కడ చూసినా లైంగిక వేధింపులకు గురవుతున్నారు. ఒక ప్రక్క న్యాయం చెప్పే కోర్టులు కిరాతకుల పై శిక్షలు వేస్తున్న అప్పటికి మరోవైపు నుంచి మరలా అలాంటి కిరాతకులు పుట్టుకొస్తున్నారు.ఇటీవల ఒక మహిళపై లైంగికంగా హింసించి ఆమెను చంపేసిన కిరాతకుడు సీరియల్ కిల్లర్ మోహన్ కుమార్.ఇతనిని పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టుకు హాజరుపరచగా కోర్టు తీర్పు మరణశిక్ష విధించింది. అయితే హైకోర్టు మాత్రం మరణ శిక్ష నుండి తొలగించి జీవితాంతం ఖైదీ గా ఉండాలని మారుస్తూ గురువారం 12వ తేదీన తీర్పు చెప్పింది .

అయితే మోహన్ కుమార్ దక్షిణ కన్నడ జిల్లాలో 2004 నుంచి 2009 వరకు కనీసం 20 మంది ఆడవాళ్లపై అతికిరాతకంగా లైంగికంగా వేధించారని తరువాత వారిని చంపేశాడని రాష్ట్రవ్యాప్తంగా అప్పట్లో తీవ్రంగా సంచలనం రేగింది.ఇంత ఘోరమైన పనులు చేసినందుకు మరణశిక్ష తో బుద్ధి చెప్పాల్సింది పోయి, హై కోర్టు శిక్షను మార్చి జీవిత ఖైదీగా ముద్ర వేసింది .అంతేగాకఅంతేగాక ఎంత క్రురుడు అయినా చంపే హక్కు లేదని ఇలాంటి వాళ్లు ఏ పరిస్థితుల్లో ను బయటకు విడుదల చేయకూడదని భావించారు.అంతేగాక ఇలాంటి వారు సమాజంలో జీవించడానికి ఎంతమాత్రం అర్హుడు కాదని , వీడిని క్షమించ కూడదని కొంతమంది న్యాయమూర్తులు తెలియజేస్తున్నారు.