Bharath Today

Around the World

17న ధర్మవరంలో వైయస్ జగన్ పర్యటన

ఇటీవల కాలంలో చేనేత కార్మికులకు ఎదురైన సమస్యలను పరిష్కరించే సత్తా ఎవరికీ లేదు అని పేర్కొన్నారు. అయితే ధర్మవరం నియోజకవర్గ సమన్వయకర్త కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి శనివారం 14వ తేదీన ఆయన గృహంలో విలేకరులు ముందు మాట్లాడుతూ చేనేతల ను మోసం చేస్తున్నా ప్రభుత్వాన్ని గద్దె దింపే రోజులు దగ్గరలోనే ఉన్నాయని తెలిపారు.

అంతేకాక నేతన్నల దీక్షలకు మార్గాన్ని చూపేందుకు దగాకోరు ప్రభుత్వాన్ని నిలదీయడానికి ధర్మవరానికి ఈ నెల 17 వ తేదీన వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి గారు వస్తున్నారని తెలిపారు.

చేనేతలకు రావాల్సిన సంక్షేమ పథకాలన్నింటినీ నిలిపివేసి టిడిపి ప్రభుత్వం వాళ్లని ఇబ్బందులకు గురి చేస్తుందని విమర్శించారు.
అయితే ఈ మధ్య కాలంలో 33 రోజులు నేతన్నలు దీక్షలు చేస్తే ప్రభుత్వం పట్టించుకోలేదని అంతేగాక నేతలకు మద్దతుగా అధికారులు ప్రశ్నించడానికి వెళితే పోలీసుల చేత కొంత మంది నాయకులు అణగద్రొక్క ఆరని తెలిపారు.

చేనేత కార్మికులకు న్యాయం జరిగే అంతవరకు పోరాటం చేస్తామని వైసీపీ నాయకుడు తెలియపర్చారు.

Updated: December 29, 2017 — 8:26 am
Bharath Today © 2018 Frontier Theme