ఉయ్యాలవాడకు ముహూర్తం ఖాయం

ఉయ్యాలవాడకు ముహూర్తం ఖాయం

ఖైదీ నంబర్ 150తో రీఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి.. మహా ఉత్సాహంగా ఉంటున్నారు. సినిమాల్లోకి తన తిరిగి రాకకు.. అభిమానుల నుంచి ఈ స్థాయిలో స్వాగతం లభించడంపై చాలానే సంతోషంగా ఉన్నారు. అదే ఆనందంతో.. తన నెక్ట్స్ ప్రాజెక్టును ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని మొదలుపెట్టేస్తున్నారు మెగాస్టార్.

స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితమే.. మెగా151 కథ కాగా.. స్టైలిష్ డైరెక్టర్ అని పిలిపించుకుంటున్న సురేందర్ రెడ్డి దర్శకుడు. ఈ చిత్రాన్ని ఆగస్టులో లాంఛ్ చేయనున్నారని.. ప్రీ ప్రొడక్షన్ పనులు పీక్స్ లో ఉన్నాయనే సంగతి తెలిసిందే. అయితే.. ఆగస్ట్ 22న మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా.. ఉయ్యాలవాడ ప్రాజెక్టును లాంఛ్ చేయాలని ఇన్నాళ్లు భావించారట అంతా. అయితే.. ఇప్పుడీ ముహూర్తం విషయంలో మార్పులు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. స్వాతంత్ర్యం కోసం పోరాడిన యోధుడి వీర గాధ కావడంతో.. సినిమా ప్రారంభానికి స్వాతంత్ర్య దినోత్సవం అయితేనే కరెక్ట్ అని ఫిక్స్ అయ్యాడట దర్శకుడు. ఈమేరకు నిర్మాత రామ్ చరణ్ కు సమాచారం ఇవ్వడం.. అక్కడి నుంచి మెగాస్టార్ కు మెసేజ్ పాస్ అవ్వడం.. గ్రీన్ సిగ్నల్ వచ్చేయడం జరిగిపోయాయని అంటున్నారు.

  • టెక్నాలజీ More...

  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *