డ్రగ్స్ కేసులో ముమైత్ ఖాన్ కు రిలీఫ్!

తెలుగు రాష్ట్రాలలో తీవ్ర సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులో ప్రముఖ డాన్సర్ ముమైత్ ఖాన్ కు విచారణ నుంచి మినహాయింపు ఇచ్చారని సమాచారం. ఆమె పుణేలో జరుగుతున్న బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఆ కార్యక్రమ నిబంధన ప్రకారం డెబ్బైరోజుల పాటు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు పంపరాదు. ఒక దశలో అక్కడకు వెళ్లి ఆమెను అరెస్టు చేస్తారా అన్న ప్రచారం జరిగినా, చివరికి ఆమెను విచారణ నుంచి మినహాయించారని అంటున్నారు.

ఈ నెల ఇరవై ఒకటిన ఆమె సిట్ ముందుకు విచారణ నిమిత్తం రావల్సి ఉంది.కాగా అసలు ఆమె స్థిర నివాసాన్ని గుర్తించి అధికారులు విఫలమయ్యారని కూడా ప్రచారం ఉంది. కాగా మరో ప్రముఖ నటి చార్మి ప్రస్తుతం విదేశాలలో ఉన్నారు. ఆమెను కూడా ఎప్పుడు విచారిస్తారో తెలియదు.

  • టెక్నాలజీ More...

  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *