తన కూతురికి గట్టి వార్నింగ్ ఇచ్చిన ప్రముఖ స్టార్.. ఎందుకంటే?

టాలీవుడ్ ప్రముఖలను డ్రగ్స్ కేసు.. నిద్ర పట్టకుండా చేస్తుంది. ఇప్పటికే సినీ ప్రముఖలకు నోటిసులు వెళ్లడం.. వారిని విచారణ జరపడం.. వారు ఆరోపణలు ఎదురుకోవడం జరుగుతోంది. అయితే ఈ డ్రగ్స్ రాకెట్ లో తెలంగాణ మంత్రి కెటీఆర్ స్నేహితులు ఉన్నారని.. ఇటివలే కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ ట్విట్ చేసారు. ఈ ట్విట్ తో.. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్ మధ్య గొడవ మొదలైంది.

అయితే దిగ్విజయ్ సింగ్‌ చేసిన ట్వీట్‌కు కేటీఆర్‌ ఘాటుగా స్పందించారు. దిగ్విజయ్ సింగ్ విచక్షణ కోల్పోయారని.. ఆయనకు విశ్రాంతి చాలా ముఖ్యమని కేటీఆర్ రీట్విట్ చేశారు. దాంతో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్దం చెలరేగింది. అయితే ఇది ఇలా ఉంటే ఈ వివాదం మధ్యలోకి మంచు లక్ష్మీ ఎంట్రీ ఇచ్చింది. కేటీఆర్ ఇచ్చిన జవాబుకి.. వత్తాసు పలుకుతూ.. దిగ్విజయ్ సింగ్ విచక్షణ కోల్పోయారని.. ఆయనకు విశ్రాతి అవసరం అని.. ఎద్దేవా చేశారు. దాంతో ఈ విషయంపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇక పొంగులేటి సుధాకర్ రెడ్డి ఏకంగా మోహన్‌బాబుకు ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దిగ్విజయ్ సింగ్ పై మంచి లక్ష్మీ అలా ఎలా కామెంట్స్ చేస్తుందని ప్రశ్నించారట.

మీ అమ్మాయిని రాజకీయాలో వేలు పెట్టొద్దని చెప్పండి అంటూ మోహన్ బాబుకి గట్టిగా చెప్పారట. అయితే మంచు లక్ష్మీ ట్విట్ పై మోహన్ బాబు కూడా పొంగులేటి సుధాకర్ రెడ్డితో ప్రతిస్పందించారట. మా అమ్మాయి అలా చేయకుండా ఉండాల్సిందని అన్నారట. తర్వాత మంచు లక్ష్మీకి మోహన్ బాబు వార్నింగ్ ఇచ్చాడట. మరోసారి ఇలాంటివి చేయొద్దు అని చెప్పినట్లు సమాచారం.

  • టెక్నాలజీ More...

  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *