రియాల్టీ షోలో న‌కిలీ జంట‌లంట‌!

సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన పోశాని

రియాల్టీ షోల‌పై పోశాని ఫైర్ అయ్యారు. ఓ వైపు బ‌తుకుజ‌ట్కాబండి రియాలిటీ షో చేస్తున్న పోశాని ఈ వ్యాఖ్య‌లు చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. రియాలిటీ షోల‌లో న‌కిలీ జంట‌ల‌ను పెడుతున్నార‌ని పోశాని గుట్టువిప్పారు. ప్రముఖ సినీ నటుడు పోసాని మురళీ కృష్ణ రియాల్టి షోలపై చేసిన వ్యాఖ్యలు సఃహజంగానే సంచలనంగా ఉన్నాయి.రియాల్టీ షోలు కొన్నిటిలో నకిలీ జంటలను పెడుతున్నారని, నిర్వాహకులే ఎవరి వైపు ఉండాలో నిర్ణయిస్తుంటారని, కుటుంబ సభ్యులను కొట్టుకోవాలని సూచిస్తుంటారని ఆయన వెల్లడించారు.

తెలుగు టీవీ చానళ్లలో వచ్చే షోలు అన్ని నిజంకాదని ఆయన అన్నట్లుగా మీడియాలో కధనం వచ్చింది.ఒక తెలుగు చానల్ లో వ్యాఖ్యాతగా కూడా ఉన్న ఆయన కొన్ని కార్యక్రమాలే నిజమైనవని, కొన్ని నకిలీ సులు కూడా ఉన్నాయని అన్నారు. భార్యభర్తలను కొట్టుకోమని కార్యక్రమ నిర్వాహకులే సూచిస్తారని ఆయన చెప్పారు.అన్నీరోజులు జంటలు రారని, అలాంటి సమయంలో నిర్వాహకులే నకిలీ జంటలను ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని నడిపిస్తారని ఆయన అన్నారు.

ప్రస్తుతం వస్తున్న కార్యక్రమాల్లో తన కార్యక్రమానికే పేరొచ్చిందని పోసాని తెలిపారు. తాను మాత్రం అలాంటి నకిలీ జంటలతో కార్యక్రమాన్ని చేయనని నిర్మాతలకు చెప్పానని, తనకు నిజం అనిపిస్తేనే షో చేస్తానని ఆయన వివరించారు. నిజంగానే బ‌తుకు జ‌ట్కాబండి కార్యక్ర‌మంలో ఇన్నాళ్లూ ఒరిజిన‌ల్ జంట‌లే వ‌చ్చారా…? లేక వాళ్లు కూడా అప్పుడ‌ప్పుడు నిక‌లీ జంట‌ల‌ను తీసుకొస్తారా..? అన్న విష‌యాన్ని పోశానే బ‌య‌ట‌పెట్టాలి మ‌రి.

  • టెక్నాలజీ More...

  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *