విచారణకు వెళ్లే ముందు.. తరుణ్ ఎక్కడికెళ్లాడో తెలుసా?

గత కొన్ని రోజులుగా టాలీవుడ్ ని కుదిపేస్తున్న డ్రగ్స్ వ్యవహారం రోజుకో విచారణతో అనేక మలుపులు తిరుగుతోంది. రోజుకొక సెలబ్రెటీ ని విచారిస్తున్న సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్ టీమ్ అనేక విషయాలను తెలుసుకుంటున్నారు. ఇప్పటికే నలుగురిని విచారించగా నేడు హీరో తరుణ్ ని విచారిస్తున్నారు.

తనకు డ్రగ్స్ వ్యవహారంలో ఏం సంబంధం లేదని ఇది వరకే మీడియా ముందు తన వాదనను వినిపించాడు తరుణ్. సినీ అవకాశాలు లేక దాదాపు కనుమరుగు అయ్యే దశలో ఉన్న ఈ హీరో కూడా డ్రగ్స్ వ్యవహారంలో నోటీసులు అందుకున్న విషయం తెలిసిందే. విచారణలో భాగంగా శనివారం సిట్ ముందు హాజరయ్యాడు తరుణ్. తనకు ఒకప్పుడు ఆన్ అనే పబ్ ఉండేదని, అది తన సొంతం కూడా కాదని, తను భాగస్వామిని మాత్రమే అని.. డ్రగ్స్ వ్యవహారంలో పబ్బుల పేర్లు వినిపించడంతో పరువు పోతుందని.. తను పబ్ నే అమ్ముకున్నానని తరుణ్ ఇది వరకూ చెప్పాడు.

ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. సిట్ విచారణకు ఇంటి దగ్గర నుంచి బయల్దేరిన తరుణ్ మార్గమధ్యంలో గుడికి వెళ్లాడు. జూబ్లీహిల్స్ 12లోని తన ఇంటి నుంచి తండ్రితో కలిసి గుడికి వెళ్లి, అక్కడ నుంచి సిట్ ఆఫీసుకు బయల్దేరాడు. ఉదయాన్నే అక్కడకు చేరుకున్నాడు. తరుణ్ విచారణ ఇప్పటికే ప్రారంభం అయ్యింది. ఈ రోజు విచారణకు పలు పబ్ ల నిర్వాహకులు కూడా హాజరయ్యారు.

నిన్న ఉదయం పది గంటల నుంచి రాత్రి 11.30 గంటల వరకు సుబ్బరాజును విచారించిన సంగతి తెలిసిందే. ఇంతవరకు విచారించిన ముగ్గురి నుంచి రక్తం, గోళ్లు, వెంట్రుకల శాంపిల్స్ ను సిట్ సేకరించింది. ఇక తరుణ్ ని కి కూడా చాలా సేపు విచారణ జరపనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

  • టెక్నాలజీ More...

  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *