• 2019 లో కాంగ్రెస్ అధికారం మాదే అంటుంది

    Published October 18,2017 , 9:48 AM Posted By andhra

    2019 లో కాంగ్రెస్ అధికారం మాదే అంటుంది

    2019 జరిగే ఎన్నికలకు ఇప్పటి నుంచే కొట్టుకొని చేస్తున్న పార్టీలు నాయకులు అయితే ప్రస్తుతం తెలుగుదేశం, వైఎస్సార్ పార్టీ మాదే అధికారం అంటే, ఇప్పుడు కాంగ్రెస్ మాత్రం ఏకంగా 2019 అధికారం మాదే అంటుంది.

    2019లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఎమ్మెల్సీ రాజగోపాల్ రెడ్డి అన్నారు, అయితే సోమవారం వేచేపల్లి మండలం గుండేపల్లి గ్రామపంచాయతీ పరిధిలో ఉన్ననదిని బావి గూడెంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపనచేస్తున్నాడు.

    ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం వచ్చినా తరువాత బంగారు తెలంగాణ సాధిస్తామని చెప్పిన కేసీఆర్ తన కుటుంబాన్ని మాత్రమే బంగారంగా చూస్తున్నారని అన్నారు. అయితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మాత్రం బలమైన క్యాడర్ ఉందని నాయకులు అధైర్యం గా ఉండవద్దని భరోసా ఇచ్చారు.