Bharat Today

Trending News

వైసీపీలో రాజుకున్న ‘కాపు’ చిచ్చు

ప్రశాంతంగా ఉన్న ఏపీలో కాపు చిచ్చు రగిల్చింది జగన్ అని అందరికి తెలుసు. పైకి ముద్రగడ కనిపిస్తున్నా అతని వెనుక ఉన్న నీడ మాత్రం జగన్ అనేది రాజకీయాలు చూస్తున్న ఏ ఒక్కరికైనా అర్ధం అవుతుంది.

కాపుఉద్యమం పేరుతో తెలుగుదేశాన్ని దెబ్బకొట్టాలని జగన్ రాజకీయ ఎత్తుగడ వేసాడు. కానీ ఏపీ సీఎం చంద్రబాబు ముందు ఆ ఆటలు సాగుతాయా ఏంటి..? అందుకే అదును చూసి చాలా తెలివిగా కాపు రిజెర్వేషన్ ప్రకటించి ఉద్యమ వేడి తగ్గించడమే కాకుండా దాని ద్వారా కాపుల్లో సానుభూతి కొట్టేసాడు. ఇప్పటి వరకు చంద్రబాబు మీద గుర్రుగా ఉన్న కాపు నేతలంతా చంద్రబాబు మీద ఇప్పుడు అభిమానం పెంచేసుకున్నాడు. ఈ వార్త జగన్ కి మింగుడు పడడంలేదు. అంతే కాకుండా ఈ ఈ చిచ్చు మళ్ళీ బీసీల రూపంలో వచ్చి జగన్ మెడకు చుట్టుకుని బిగుస్తోంది.

కాపు రిజర్వేషన్ల వ్యవహారంలో జగన్ సానుకూలంగా ఉంటే .. పార్టీలో ఉన్న బీసీ నేతలు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో వైసీపీలోని రెండు సామాజిక వర్గాలు నువ్వా.. నేనా అనే స్థాయిలో గొడవలకు దిగుతున్నారు. అసలే అంతంత మాత్రంగా ఉన్న వైసీపీలో కాపుల రిజర్వేషన్ల వివాదం ఏ స్థాయిలో రచ్చ అవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.

మొన్నటి వరకు ముద్రగడ పద్మనాభం దీక్షలకు మద్దతు పలికిన వైఎస్సార్ పార్టీలో ప్రస్తుతం నిరసన గళం జోరందుకుంది. కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయడంపై ఆ పార్టీలో ఉన్న బీసీలు తిరగబడుతున్నారు. దీంతో ఆ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌తో సహా నేతలంతా డైలమాలో పడ్డారు. కాపులకు రిజర్వేషన్లు ఇచ్చే విషయంలో వ్యతిరేకత లేదు గానీ, బీసీలకు అన్యాయం జరగకుండా చేయాలని మాత్రం చెప్పి పక్కకు తప్పుకుంటున్నారు.

ఇంకో వైపు ఆ పార్టీలో ఉన్న బీసీ నేతలు కాపు రిజర్వేషన్లను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోమని, ప్రభుత్వం నిర్ణయాన్ని మార్చుకోకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరిస్తున్నారు. పార్టీ అభిప్రాయంతో సంబంధం లేదని, బీసీలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమని వారు హెచ్చరిస్తున్నారు. కాపు రిజర్వేషన్ల వ్యవహారంలో పార్టీలో జరుగుతున్న రచ్చపై జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. పాదయాత్రలో బిజీగా ఉన్న జగన్ ఈ విషయం మీద స్పందిస్తాడో లేదో చూడాలి.

Updated: December 7, 2017 — 4:39 am

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Bharat Today © 2018 Frontier Theme