వేరుశనగలు ఉడకబెట్టి తినడం వలన కలుగు ఉపయోగాలు?

వేరుశనగలను అనేక మంది వేయించి తినడమే లేకపోతే పచ్చడి తినడం చేస్తుంటారు. కాని వేరుశనగను ఉడికించి తింటే ఏమవుతుందో తెలుసా?

మన శరీరంలో హానికరమైన వ్యాధుల బారి నుండి బయటపడి ఆరోగ్యంగా ఉండవచ్చుఅజీర్ణ సమస్యలతో చాలామంది బాధపడుతుంటారు. ఎక్కువగా చిన్న పిల్లల్లో కూడా ఈ వ్యాధి ఉంటుంది. కాబట్టి ఈ వేరుశనగలను ఉడికించి తినడం వలన ఇందులోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. హృద్రోగ సంబంధిత వ్యాధులను అజీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. మధుమేహ వ్యాధి నుండి ఉపశమనాన్నిస్తుంది. వేయించిన వాటికంటే ఉడికించిన శనగలు తక్కువ క్యలరిలు ఉంటాయి. ఫలితంగా ఒబేసిటీ దూరంగా ఉండవచ్చు.

అలాగే వేరుశనగ నూనెను ఉపయోగించడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు ఈ నూనెలో యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలు కొవ్వు పదార్థాలు మొనోసాకరైడ్ లతోపాటు విటమిన్-ఏ విటమిన్-డి, విటమిన్-ఇ, పుష్కలంగా ఉంటాయి.

వేరుశనగ నూనెను కణాలను సంరక్షించే గుణాలను కలిగి ఉంటుందిశరీరంలో క్రొవ్వు స్థాయిలను తగ్గిస్తుంది. మొటిమలను తగ్గించడానికి వేరుశనగ నూనెను వాడితే మంచి ఫలితం ఉంటుంది. రెండు స్పూనుల వేరుశనగ నూనెను తీసుకుని అర స్పూన్ నిమ్మరసాన్ని కలిపి చర్మానికి రాస్తే మొటిమలు దూరమవుతాయి. మధుమేహ వ్యాధిగ్రస్తుల శరీరంలోఇన్సులిన్ ఉత్పత్తి స్థాయిలో పెరగడానికి గాను వేరుశనగ నూనెను వాడాలి. ఈ నూనె శరీరంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించి చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Bharath Today
Assign a menu in the Left Menu options.