సాధారణ ఎన్నికలకు సెమీ ఫైనల్ కానున్న స్థానిక సంస్థల ఎన్నికలు

politics

బలా బలాలపై కసరత్తు చేస్తున్న రాజకీయ పార్టీలు, ఏపీలో మారనున్న సమీకరణాలు

భారత్ టుడే : ప్రతి అయిదేళ్ల కోసారి ఎన్నికలు నిర్వహించుకొనే అవకాశ౦ మన రాజ్యాంగం  మానకు వేసులబాటు కల్పించింది. ఈ నేపథ్యంలో 2018 ఆగష్టు 2 నాటికి గ్రామ పంచాయతీల ప్రజాప్రతి నిధుల పదవీకాలం ముగియనుండడంతో ఒకవైపు ఎన్నికల సంఘం మరోవైపు ప్రభుత్వం ముందస్తు ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో 2018 మే నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించవచ్చని అధికార వర్గాలు భావిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం కూడా ముందస్తుగా ఎన్నికలు నిర్వహించాలన్న యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల సంఘానికి 6 నెలల ముందే ఎన్నికలు నిర్వహించే అధికారం కూడా ఉంది. ముందస్తు ఎన్నికల నిర్వహణ. ఏ  రాజకీయ పార్టీకి లాభం చేకూరుతాయని రాజకీయ పార్టీలో ఉత్కంఠ నెలకొంది.

స్థానిక సంస్థల ఎన్నికల అంటే సాధారణ ఎన్నికల కన్నా ప్రతిష్టాత్మకంగా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సాధారణ ఎన్నికలు రానున్న నేపథ్యంలో స్థానిక ఎన్నికల బలాబలాల అంచనాలను వివిధ రాజకీయ పార్టీలు విశ్లేషించుకుంటాయి.

గడచిన 4 సంవత్సరాలలో ఏపీలో వివిధ రాజకీయ పార్టీలు క్షేత్రస్థాయిలో ఆయా పార్టీలను బలోపేతం చేసేందుకు తెలుగుదేశం, వైసీపీ, బిజెపి, కాంగ్రెస్, జనసేన, అమ్ఆద్మీ, సి.పీ.ఐ, సి.పీ.ఐ(యం), లోకశత్త,   ఇతర పార్టీలు కూడా వ్యూహ ప్రతివ్యూహాలతో ఉన్నాయి. అదే విధంగా రాష్ట్ర రాజకీయాలను 2018, 2019 లలో ప్రభావితం చేయనున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  క్షేత్రస్థాయిలో వైసిపి గడపగడపకు వైయస్సార్, తెలుగుదేశం ఇంటింటికి తెలుగుదేశం, వైఎస్సార్ కుటుంబం, జనసేన సభ్యత్వం బలోపేతం బిజెపి క్షేత్రస్థాయిలో బలోపేతం వంటి అంశాలపై పార్టీలు పోటీ పడుతున్నాయి.

స్థానిక సంస్థల పాలనలో జన్మభూమి కమిటీల జోక్యంతో ప్రజలు అసంతృప్తి వాతావరణం నెలకొన్నట్లు తెలుస్తోంది.  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామీణ ప్రాంత ప్రజల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అర్హులందరికీ చేరడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పరిపాలనలో మితిమీరిన స్థానిక రాజకీయ జోక్యం ఒక రాజకీయ పార్టీకి తలనొప్పి గా మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టి.డి.పీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలు ఫై ప్రజల్లో పూర్తిస్థాయి అవగాహన లేకుండా పోయిందని పలువురు ఆరోపిస్తున్నారు.

స్థానిక సంస్థల్లో ఏ పార్టీకి కేడర్ బలంగా ఉంటుందో ఆ పార్టీ సాధారణ ఎన్నికల్లో విజయం సాధిస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇలాంటి తరుణంలో క్షేత్ర స్థాయిలో స్థానిక సంస్థల ఎన్నికలకు సెమీ ఫైనల్ గా పరిగణించవచ్చని రాజకీయ పార్టీలు భావిస్తూ ఉంటే స్థానిక సంస్థల ఎన్నికలను సాధారణ ఎన్నికలకు సెమీ ఫైనల్ గా పరిగణి౦చలేమని  రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ లో జరగనున్న ముందస్తు ఎన్నికలు ఏ పార్టీకి లాభం చేకూరుస్తాయో  వేచిచూడాలి.

Editor in Chief Mr.G.Ankalu – Amaravathi