బాలీవుడ్ నటి దీపికా పెద్ద మనసుతో వ్యవహరించారు

సినీ పరిశ్రమల్లో ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పెద్ద మనసుతో వ్యవహరించినట్లు తెలుపుతున్నారు.మంగళవారం దావణగెరె జిల్లాలో పర్యాటన చేసిన ఆమె, గ్రామాలలో అనారోగ్యంగా ఉన్న చిన్నారులను కలుసుకొని వారిని మానసిక ఒత్తిడి నుండి విడిపించి వారిలో చైతన్యం కలిగించింది. అంతేగాక దీపికా స్థాపించిన లివ్ లవ్ లాఫ్ అనే పౌండేషన్ తరఫున కొంత ఆర్థిక సహాయం వారికి అందించారు.

ఇంకా కొన్ని గ్రామాలను, ఆస్పత్రిని పరిశీలించి రోగులు పడుతున్న ఇబ్బందులకు కొంత సహాయం చేశారట.ఏ.డి.పి సoస్థ తరఫున దీపికా పదుకోణే గ్రామంలో ఆయా కుటుంబాలను ఆదుకునేందుకు ఆమె సొంతంగా ముందుకు వచ్చిoది.

అదీగాక రోగులకొరకు ప్రత్యేక చర్య తీసుకుని వారిని మాములు స్థితికి తీసుకురావడానికి కృషి చేసిందని పలువురు తెలియపరిచారు. ఆమె రాకతో అనేక మంది జనం దీపికాని చూడడానికి వచ్చారని తెలిపారు.

గ్రామాల, పర్యటన అయిపోయిన తదుపరి దగ్గరలో ఉన్నాఒక హోటల్ కి చేరుకోవడంతో అక్కడ కూడా ఆమెను చూడడానికి జనం కిక్కిరిసిపోయారు అని సమాచారం.

Bharath Today
Assign a menu in the Left Menu options.