• మంత్రి తలసాని కారును ఢీ కొట్టిన లారీ

    Published October 14,2017 , 5:27 PM Posted By andhra

    మంత్రి తలసాని కారును ఢీ కొట్టిన లారీ

    ఎక్కడ చూసినా అతి వేగం వల్ల అనేక అనర్థాలు చోటుచేసుకుంటున్నాయి. బుధవారం అధికారిక కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తున్నా మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్ కుమార్ రెడ్డి మరియు తెలంగాణ మంత్రి శ్రీనివాస్ యాదవ్ వస్తున్న కారును లారీ ఢీ కొట్టింది.

    హైదరాబాదుకు దగ్గర ఉన్న కీసర ఔవుటర్ రింగ్ రోడ్డుపై ఈ సంఘటన జరిగింది. ప్రమాదవశాత్తు కారు దెబ్బతిన్నప్పటికీ దానిలో ఉన్న అందరూ స్వల్పగాయాలతో సురక్షితంగా ఊపిరి పీల్చుకుని తప్పించుకున్నారు.

    మేడ్చల్ జిల్లాలోని కీసరలో ఒక నూతన కలెక్టరేట్ భవన నిర్మాణం యొక్క శంకుస్థాపన చేసి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. అంతేగాకఢీ కొట్టిన లారీ ని పోలీసులు అదుపులోకి తీసుకుని దీనికి గురించి మరింత సమాచారం తెలుసుకుంటున్నారు.