తప్పుడు కేసులు పెట్టి జీవితాలు నాశనం చేశారు

taajavarthalu

వైఎస్సార్ జిల్లాలో ప్రొద్దుటూర్ అనే ఊరిలో జరిగిన రియల్ స్టొరీ. చదువుకునే సమయంలో స్నేహితులతో కలిసి క్రికెట్ పందాలను ఏర్పాటు చేస్తున్నారట. అయితే ఐదు సంవత్సరాల తర్వాత ఉద్యోగాలు, సంపాదించుకుని దానిలో స్థిరపడ్డ సమయంలో క్రికెట్ బెట్టింగ్ పోటీ ఏర్పాటు చేస్తున్నామని పోలీసులు అక్రమంగా పిలిపించి మా పై కేసులు నమోదు చేసి మా భవిష్యత్తులను నాశనం చేశారు అని ఆ గ్రామంలో ఉన్నా ఇద్దరు యువకులు తెలిపారు.

ఈ విషయం మీద మంగళవారం మానవ హక్కుల జిల్లా కన్వీనర్ జయశ్రీ గారిని ఆశ్రయించి జరిగిన సంఘటన అంతా పత్రికా విలేఖరులకు కూడా తెలిపారు. రమేష్ అనే యువకుడు ఉద్యోగరీత్యా తిరుపతిలో ఒక ప్రైవేటు కంపెనీలో మేనేజరుగా చేస్తున్న నన్ను కూడా గంజాయి కేసులో పోలీసులు ఇరికించారని పేర్కొన్నారు.

ఉద్యోగస్తులుగా ఉన్నా మమ్ములను తీసుకువచ్చి నేరస్తులుగా మార్చివేస్తున్నారు, ఈ నేరాల నుండి మాకు విడుదల కావాలని, పోలీసులు ఉద్యోగులు చేసే వారిని నేరస్తులుగా చేస్తున్నారని మానవహక్కుల కన్వీనర్ జయశ్రీ అన్నారు. పోలీసులు నిజంగా అక్రమంగా నడుచుకునే వారిని వదిలిపెట్టి, ఇలాంటి అమాయకులపై కేసులు పెట్టారు అని అంటున్నారు. యువకుల జీవితాలు ఇలా రోడ్లు పాలివ్వడానికి కారణం ఎస్సై.వినోద్ కుమార్, సి.ఐ నారాయణ ఫై చర్యలు చేపట్టాలని తెలిపారు.