విద్యా మంత్రి గారు విద్యార్థులకు న్యాయం చేయండి.

politics

భారత్ టుడే : అయ్యా విద్యా మంత్రి గంటా శ్రీనివాసరావు గారు పాఠశాల, కళాశాల చదువుకొంటున్న విద్యార్దుల భవిష్యత్తుకు న్యాయం చేయండి. రాష్ట్రంలోని 8, 9, 10, తరగతుల విద్యార్దులకు సంబంధించి SA1 పరీక్ష పేపర్లు లీక్ అయి పసిహృదయాలు గాయాలపాలై ఎంతో బాధపడిన సందర్భాన్ని చూసి మనమందరం చలించిపోయా౦.

ఆ సంఘటన మరవక ముందే కొన్ని కళాశాలల్లో విద్యార్థులు వివిధ కారణాలతో మరణించడం ఎంతో బాధాకరం. మానవ వనరుల అభివృద్ధి శాఖామాత్యులు గంటా శ్రీనివాసరావు గారు సున్నిత మనస్కులైన విద్యార్థుల జీవితాలను కాపాడండి. ప్రతి తల్లి,తండ్రి తమ బిడ్డలపై పెట్టుకున్న ఎన్నో ఆశయాలను నెరవేర్చడంలో పెద్దలు పాలకులు పాత్ర ఎంతో సహకారం అవసరమని ప్రతీ తల్లితండ్రులు కోరుకుంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి లాంటి పెద్ద దిక్కు ఈ రాష్ట్రానికి ఎంతో అవసరమని ప్రజలు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్దులను రక్షించి వారి తల్లితండ్రుల మనో భావాలను నూటికి నూరు శాతం కాపాడాలని ప్రజలు కోరుకుంటున్నారు.

Editor in Chief Mr.G.Ankalu – Amaravathi