• భూమి నుంచి వింత శబ్దాలు ,పొగలు

  Published October 14,2017 , 5:13 PM Posted By andhra

  భూమి నుంచి వింత శబ్దాలు ,పొగలు

  ఇటీవల కాలంలో ఆకాశం లో జరిగే మార్పులు గురించి భూమి అంతం గురించి సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి అందరికీ తెలిసిందే.

  అయితే బుధవారం 7 గంటల సమయంలో కర్నూలు జిల్లాలో భూమి నుంచి అనేక రకాల వింత శబ్దాలు పొగలు అక్కడ ఉన్న ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయని తెలిపారు.

  అయితే హాలహర్వి మండలంలో ఎంకేపల్లి అనే గ్రామంలో భూమి నుంచి ఒక్కసారిగాపొగ రావడంతో అక్కడ ఉన్న నివాసాలకు కలవరం పుట్టింది.

  ఎక్కువ స్థాయిలో భూమినుంచి ఆకాశానికి పొగలు ఎగసి పడ్డాయి . దీనికి కారణం ఏమిటో ఎవరికీ అర్థం కాలేదు.కొంతమంది రైతులు వారి పొలాల్లో పనులు చేస్తుండగా ఈ సంఘటన జరిగిందని సమాచారం అధికారులు తెలిపారు.కానీఅధికారులు వచ్చేసరికి పోగలు మాయమైపోయినవి . పచ్చగా వున్న పొలాల పై పడిన అగ్గిని చూసి అధికారులు విచారణ చేస్తున్నారు.