మంత్రి నారాయణకు డబ్బు మూటలు కావాలి.. పిల్లలు చనిపోతుంటే పట్టదా?

politics

ప్రస్తుత రోజుల్లో విద్యార్థులు యొక్క మరణాలు పెరిగిపోతున్నాయి. అయితే అధికారులు మాత్రం పట్టీ పట్టనట్లు ఉంటున్నారు. ఈ విషయం పై మంగళవారం మీడియా ముందు మాట్లాడిన రోజా చంద్రబాబు తీరుపై ఆగ్రహం చూపించింది. విద్యార్థుల మరణాలను చంద్రబాబు పట్టలేదని కమిటీని వేసి చేతులు దులుపుకుంటున్నారని తెలియజేసింది.

ఎమ్మెల్యేలను కొనేందుకు డబ్బులిస్తున్నారు కాబట్టి చంద్రబాబు నారాయణ పై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్లో పలువురు నారాయణ సంస్థల్లో చదువుతున్నా స్టూడెంట్ తీవ్ర ఒత్తిడికి లోనై ఆత్మహత్యలు చేసుకుంటున్న విషయం తెలిసిందే కార్పొరేట్ కాలేజీల్లో విద్యార్థులు ఆత్మహత్యలు చాలా బాధాకరం గా ఉన్నాయి. 158 హాస్టల్లో నడుస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది అని ప్రశ్నించారు.

విద్యార్థులకు కావలసిన సదుపాయాలు కాకుండా వారికి కావలసింది డబ్బు మూటలుఅని నిలదీశారు. ఆత్మహత్యలకు పాల్పడ్డా కుటుంబాలకు వెంటనే సహాయం చేయాలని డిమాండ్ చేశారు. ముందు గంటా శ్రీనివాస్ నారాయణ పై చర్యలు తీసుకోవాలని వైసిపి ఎమ్మెల్యే రోజా ఆదేశించారు.