కొబ్బరిచెట్టు పడి ప్రముఖ యాంకర్ మృతి
ముంబైలో ఊహించని ప్రమాదం సంచలనం సృష్టించింది. మహిళను ఓ కొబ్బరిచెట్టు మృత్యువులా వెంటాడింది. మార్నింగ్ వాక్ వెళ్లిన ఆమె నెత్తిపై కొబ్బరి చెట్టు ఒక్కసారిగా విరిగి పడిన షాకింగ్ ఇన్సిడెంట్ చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో దూరదర్శన్ మాజీ యాంకర్ మరణించిన వైనం తీవ్ర విషాదానికి దారి తీసింది . స్థానిక సీసీ టీవీలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. బాధిత మహిళను దూరదర్శన్ మాజీ యాంకర్ కంచన్ రజత్ నాథ్(58)గా గుర్తించారు. ముంబైలోని చెంబూర్ ప్రాంతంలోని శుక్రవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. దూరదర్శన్ మాజీ యాంకర్, యోగ టీచర్ కూడా అయిన కంచన్ నాథ్ గురువారం ఉదయం మార్నింగ్