టీ ఎక్కువగా తాగడం వలన సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా..

టీ తాగడం వలన మన శరీరంలో కొన్ని ఇబ్బందులు వస్తాయి మనలో చాలామందికి నిద్రలేవగానే టీ తాగడం అలవాటు ఒక్కపూట తాగకపోతే ఏదో వెలితిగా తల నొప్పిగా ఉంటుంది.
పని వత్తిడివలన సాయంత్రానికి డీలా పడినట్లు అనిపిస్తే టీ పడితే చాలు మళ్లీ రీచార్జ్ అయిపోతాం. టీలో రకరకాల వెరైటీలు అందుబాటులోకి వచ్చాయి. ఉపశమనానికి ఉల్లాసానికి కారణమయ్యే టీ వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్ లు కూడా ఉన్నాయి.
అదేమిటో తెలుసా తేనీటిలో ఉండే కెఫీన్ మెదడును చురుగ్గా ఉంచుతుంది. అధిక మోతాదులో టీ తాగితే నిద్ర సరిగ్గా పట్టకపోవడం లాంటి సమస్యలు తలెత్తుతాయి.
టీలోని తియోఫిలిన్ అనే రసాయనం డీహైడ్రేషన్ కారణం అవుతుంది. ఇది మలబద్ధకానికి దారితీస్తుంది ఉదయాన్నే టీ తాగడం వల్ల విరోచనం సాఫీగా అవుతుంది. అధిక మోతాదులో టీ తాగితే మలబద్దకం వస్తుంది.
కెఫీన్ మూడు మర్చేతుందానే సంగతి తెలిసిందే కదా కానీ కెఫిన్ మోతాదు పెరిగితే నిద్ర పట్టక పోవడం విశ్రాంతి లేకపోవడం వంటి సమస్యలతో భాధపడతారు. గర్భిణీ స్త్రీలు ఒక గ్లాసు పాలు తీసుకోవడం వలన పిండం యొక్క పెరుగుదల బాగా వృద్ధి చెందుతుంది. మీ ఆరోగ్యం కోసం గర్భంలో ఉన్న శిశువు కోసం పలు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

Bharath Today
Assign a menu in the Left Menu options.