డాక్టర్‌తో వివాహేతర సంబంధం

42 / 100

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ వ్యక్తి కిడ్నాప్ కేసు సంచలనం క్రియేట్ చేసింది. ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసులు… షాకింగ్ విషయాలు తెలిశాయి. ప్రకాశం జిల్లా కంభం అర్ధవీడు మండలంలోని నాగులవరానికి చెందిన జగన్ అనే యువకుడు, కొన్ని రోజుల క్రితం కనిపించకుండా పోయాడు. JBCలు, ట్రాక్టర్లు, డ్రోజర్లు అద్దెకిస్తూ కుటుంబంతో కలిసి కంభం ఏరియాలో నివసిస్తున్నాడు. అతని భార్య రజనీకి, ఇంటి పక్కనే ఉండే డాక్టర్‌ వెంకటరమణతో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం జగన్‌కు తెలియడంతో, అతన్ని అడ్డుతొలగించుకోవాలని ఆ డాక్టర్‌తో కలిసి పథకం పన్నింది రజనీ. ఇందుకు పక్కా ప్లానింగ్ ప్రకారం స్కెచ్ గీసుకున్నారు. మూడు రోజుల క్రితం ఓ వ్యక్తి జగన్ ఇంటికి వచ్చాడు. డాక్టర్ బంధువునంటూ ఇంట్లోకి వచ్చిన అతను… తాను కర్నూలులో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నానంటూ పరిచయం చేసుకున్నాడు. సమస్య పరిష్కారానికి వచ్చానంటూ నమ్మించి, అతన్ని కారులో బయటికి తీసుకెళ్లాడు.ఆ తర్వాత అతను గానీ, జగన్ ఆచూకీ గానీ తెలియలేదు. సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం ఇంటికి వచ్చిన వ్యక్తితో జగన్ కారులో బయటికి వెళ్లినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. మార్గమధ్యంలో డాక్టర్ కూడా ఎక్కాడు. ముగ్గరు కలిసి రావిపాడు రోడ్డు మీదుగా గొట్లగట్టు వైపు వెళ్లారు. ఆ తర్వాతి రోజు డాక్టర్, తిరిగి రజనీ దగ్గరకు వచ్చినట్టు సీసీటీవీల్లో రికార్డైంది. కొడుకు ఆచూకీ తెలియకపోవడంతో కంగారు పడిన జగన్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్‌తో పాటు డాక్టర్ కాల్‌డేటా ఆధారంగా చేసుకుని అతనే జగన్ కిడ్నాప్ కోసం ప్లాన్ వేశాడని నిర్ధారించిన పోలీసులు… అతనితో పాటు జగన్ భార్య రజనీని కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు డాక్టర్ బంధువునంటూ వచ్చిన కానిస్టేబుల్‌ కూడా పోలీసులకు చిక్కాడు. వీరిని తమదైన శైలిలో ప్రశ్నించిన పోలీసులకు జగన్ హత్యకు స్కెచ్ గీసిన విషయం ఒప్పుకుంది రజినీ. నరాలు బలహీనపడేలా ఇంజక్షన్ ఇప్పించానని ఒప్పుకుంది. డాక్టర్ వెంకటరమణ, కర్నూలు జిల్లాకు చెందిన తన స్నేహితుడితో కలిసి కొంతమంది కిరాయి హంతకులతో జగన్‌మోహన్‌రెడ్డిని హత్య చేశారు. కారులో జగన్‌ను తీసుకెళ్లిన డాక్టర్ గ్యాంగ్… కర్నూలు జిల్లా ఆత్మకూరు సమీపంలో రోళ్లపాడు అటవీప్రాంతంలో హత్యచేసి రోడ్డు పక్కన పడేసి పెట్రోల్ పోసి కాల్చారు. జగన్ మోహన్‌రెడ్డికి రజనీ స్వయానా మేనమామ కూతురు కావడం మరో విశేషం.

Leave a Comment