బియ్యం పిండితో పేస్ ప్యాక్

బియ్యప్పిండి దీనితో వంటలు వండుకోవచ్చు..ఇది తినే ఆహార పదార్ధంగా మాత్రమే అందరికి తెలుసు కానీ ఈ పిండితో అందాన్ని మరింత రెట్టింపు చేసుకోవచ్చని మీలో ఎంతమందికి తెలుసు.ఈ పిండిని వాడటం వలన చర్మానికి ఎంతో ఉపయోగకరం అని చెప్తున్నారు ఆయుర్వేద నిపుణులు…బియ్యపిండిలో కొంచం ఓట్ మీట్..పాల పొడిలను తగినంత మోతాదులో కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పట్టిస్తే శరీర ఛాయలో మంచి మార్పు వస్తుంది. అంతేగాకుండా శరీరానికి మెరుపు వస్తుంది.

బాదం పలుకుల్ని నానబెట్టి మెత్తగా చేసి ఆ పేస్టుకి బియ్యపిండి, పెరుగు కలపాలి. ఆ మిశ్రమాన్ని రాత్రి పడుకునే ముందు ముఖానికి రాసుకుని పావుగంట సేపు ఆరనివ్వాలి. తర్వాత చేతివేళ్లతో ముఖం మీద ఉన్న మురికి పోయేట్టు స్క్రబ్ చేసి నీళ్లతో శుభ్రం చేసుకోవాలి.ఇలా చేస్తే ముఖం ఎంతో మెరిసిపోతుందట. చర్మం ఎంతో మృదువుగా తయారవుతుంది.

బియ్యం పిండి..శనగ పిండిల తగినంత తీసుకుని ఈ మిశ్రమానికి కొబ్బరి నూనె కలపాలి. దీనిని ఈ మిశ్రమాన్ని స్నానం చేసే ముందు రాసుకొంటే మంచి ఫలితం ఉంటుంది. బాగా పండిన అరటిపండు గుజ్జుకు బియ్యం పిండి కలుపుకోవాలి. దీనికి ఆముదం కూడా చేర్చాలి. ఈ ప్యాక్‌ ను కళ్ళ కింద రాసుకుంటే డార్క్‌ సర్కిల్స్‌ పోతాయి.

బియ్యం పిండికి ఆలో వెరా జెల్..తేనె కలుపుకుని ఫేస్ ప్యాక్ లా వేసుకోవాలి. 20 నిమిషాల అనంతరం కడుక్కోవాలి. ముఖంపై ఉన్న మొటిమలు, మచ్చలు తొలగిపోయే అవకాశం ఉంది.

Leave a Comment