ఈ చిట్కాలు పాటిస్తే చాలు జుట్టు సమస్యలు దూరం

జుట్టు రాలిపోతున్న వారు చాలా మంది కాలుష్యంలో తిరగడం వలన అని భ్రమించి.. బయటకి వెళ్ళేటప్పుడు తగు జాగ్రత్తలు చేసుకుని వెళ్తుంటారు.. అది మంచిదే కానీ కేవలం పొల్యూషన్ వల్లనే జుట్టు ఊడిపోవడం జరగదు. దానికి చాల కారణాలు ఉన్నాయి ఒత్తిడి, ఆలోచనలు వల్ల‌ కూడా జుట్టు ఊడిపోతుంది.. అయితే అధికశాతం జుట్టు ఊడటానికి కారణం పోషక విలువలు సరిగా జుట్టుకి అందకపోవడం వల్లే. అందుకే తప్పని సరిగా పోషకాలు జుట్టుకు అందేలా చూసుకోవాలి అని చెప్తున్నారు వైద్యులు.సహజంగా జుట్టుకి అందాల్సిన పోషకాలు అందుతున్నా సరే జుట్టు ఊడిపోతుంటే అప్పుడు మిగిలిన కారణాలని అన్వేషించాలి.. తల దువ్వుకునేప్పుడు జుట్టు రాలడం సహజం. అయితే ఇది మరీ ఎక్కువగా ఉంటే జింక్‌ లోపం ఉండొచ్చని సందేహించాలి. సాధారణంగా ఈ లోపం ఉన్నప్పుడు ముందు జుట్టు పలుచగా మారి తరవాత రాలడం మొదలవుతుంది. నువ్వులూ, గుమ్మడి గింజలూ, పుచ్చకాయ గింజలూ, డార్క్‌ చాక్లెట్‌, పల్లీలు లాంటి వాటిల్లో జింక్‌ పుష్కలంగా లభిస్తుంది. వీటిని తింటూ ఉంటే జుట్టు పోషక విలువలు జుట్టుకు బాగా అంది జుట్టు రాలే సమస్య దూరం అవుతుంది.

చాలా మందికి జుట్టు రంగు మారుతుంది.. కొంత మందికి ముందు నల్లగా ఉన్నా సరే తరువాత జుట్టు కలర్ చేంజ్ అవుతుంది.. జుట్టు నల్లగా నిగనిగలాడుతూ కనిపించేందుకు తలలో ఉండే మెలనిన్‌ కారణం. ‘సిలికా’ అనే ఖనిజ లవణం జుట్టుకు తేమను అందించి, వెంట్రుకల్ని దృఢంగా ఉంచుతుంది. యాపిల్స్‌, కమలా ఫలాలు, ఎండుద్రాక్ష, ఉల్లిపాయలు, క్యారెట్లు, ఓట్స్‌, పీచు ఎక్కువగా ఉండే పదార్థాలన్నీ సిలికాను అందిస్తాయి. మన తలని క్లీన్‌ గా ఉంచుకోవాలి. షాంపో, కండిషనర్ వాడి ప్రతి రోజూ శుబ్రము చేసుకోవాలి. తలకి సరియైన నూనె రాస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫ్ఫెక్ట్స్ ఉండవు. సహజ సిద్ధంగా దొరికే షాంపూలు కానీ.. కుంకుడు కాయలతో హెడ్ బాత్ చేయడం మంచిది.

HTML ADS